ఆధ్యాత్మికంహోమ్

వైభవంగా జరుగుతున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు

#SrisailamTemple

ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మంగళవారం ఉదయం నుంచే క్షేత్రంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది.

ఉదయం 8 గంటలకు చండీశ్వర పూజ, మండపారాధన, కలశార్చన మరియు రుద్ర పారాయణలు శాస్త్రోక్తంగా ప్రారంభం కానున్నాయి. అనంతరం 9 గంటలకు లోక కల్యాణార్థం రుద్ర హోమం, చండీ హోమాలను అర్చకులు అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తారు.సాయంత్రం వేళ ఆలయంలో విశేష పూజా కార్యక్రమాలు కొనసాగుతాయి.

సాయంత్రం 5:30 గంటలకు సాయంకాల అర్చనలు, రుద్ర పారాయణలు మరియు హోమాలు జరగనున్నాయి. ఈ బ్రహ్మోత్సవాల పర్వదినాన విజయవాడలోని శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం తరఫున అధికారులు శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లకు సాయంత్రం 6 గంటలకు పట్టు వస్త్రాలను సమర్పించనున్నారు.

అనంతరం రాత్రి 7 గంటలకు భక్తుల జయజయధ్వానాల మధ్య శ్రీ స్వామి అమ్మవార్లు హంస వాహనంపై భక్తులకు దర్శనమివ్వనున్నారు.

Related posts

17 నుండి శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి పవిత్రోత్సవాలు

Satyam News

రోడ్డు ప్రమాదంలో మరణించిన టీటీడీ కళారులకు సాయం

Satyam News

Operation Mobi Trackలో భారీగా సెల్‌ఫోన్ల రికవరీ

Satyam News

సింగూరు ప్రాంతాన్ని ఆక్రమిస్తున్న మంత్రి బామ్మర్ది

Satyam News

అమెరికా ఇరాన్ మధ్య చర్చలు జరుగుతాయా?

Satyam News

600 కోట్ల రూపాయల డ్రగ్ డైవర్షన్ కేసు

Satyam News

Leave a Comment