25.2 C
Hyderabad
September 20, 2026
విజయనగరంహోమ్

రామతీర్థ పుణ్య క్షేత్రంలో ఘనంగా శివరాత్రి వేడుకలు

#Ramateerdham

ప్రసిధ్ధిగాంచిన రామతీర్ధంలో మహాశివరాత్రి వేడుకలు వైభవోపేతంగా జరిగాయి. తెల్లవారు నుంచీ రామతీర్థ పుణ్యక్షేత్రం భక్తుల రద్దీతో శివోహం అంటూ మారుమ్రోగింది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు గట్టి బందోబస్త్ ఏర్పాటు చేశారు. పోలీస్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు మాత్రం అంతగా అందుబాటులో లేదని భక్తులే పెదవి విరిచారు.

విషయం తెలుసుకున్న బందోబస్త్ కు ఇంచార్జ్ బొబ్బిలి డీఎస్పీ భవ్యారెడ్డి ఎట్టకేలకు కంట్రోల్ రూమ్ ను భక్తుల అందుబాటులో కి తీసుకురావడంతో ఆనందం వ్యక్తం చేశారు. రామతీర్థంలోని శివాలయంలో ఆలయ అర్చకుని సమక్షంలో లింగోద్భవ కార్యక్రమం శాస్త్రోక్తంగా వేద పండితుల నడుము వైభవోపేతంగా కొనసాగింది. ఆలయం చుట్టూ దాదాపు 100 మంది పోలీస్ బందోబస్త్ గా గట్టి భద్రత ఏర్పాటు చేసారు.

సీసీఎస్  సీఐ కాంతారావు గర్భగుడి వద్ద, భోగాపురం రూరల్ సీఐ రామకృష్ణ ఆలయం లోపల బందోబస్త్ కు ఇంచార్జ్ లు గా వ్యవహరించారు. ఎస్ఐలు దుర్గా ప్రసాద్, భాస్కర్ రావుల ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది బందోబస్త్ జరిగింది.

#RamateerdhamPolice

Related posts

కోల్డ్రిఫ్ దగ్గు మందు తయారీదారుడి అరెస్టు

Satyam News

జగన్ పార్టీ‌పై ‘సునీత’ అస్త్రం

Satyam News

యుద్ధ పరిస్థితి పై ప్రధాని మోడీ తో ట్రంప్ చర్చలు

Satyam News

జగన్ హయాంలో భారీ ‘విద్యుత్’ కుంభకోణం

Satyam News

సుప్రీంకోర్టు అనుమతి తో భార్య ను కలిసిన ఇమ్రాన్‌ఖాన్‌

Satyam News

మంగుళూరు రేవు కు చేరిన వంట గ్యాస్ షిప్

Satyam News

Leave a Comment