25.2 C
Hyderabad
September 20, 2026
ప్రపంచంహోమ్

కిమ్ వారసురాలిగా కుమార్తె జూ ఏ?

#Kim

ఉత్తర కొరియా దేశ అత్యున్నత నాయకుడు కిమ్ తన రాజకీయ వారసురాలిగా తన కుమార్తెను తీర్చిదిద్దతున్నాడు. ఈ మేరకు చర్యలు తీసుకుంటున్నట్లు స్పష్టంగా అర్ధం అవుతున్నది. ఈ నిర్ణయం అమల్లోకి వస్తే, ఆయన సోదరి కిమ్ యో జోంగ్ తో తీవ్రమైన అధికారం పోరు నెలకొనే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

దక్షిణ కొరియా జాతీయ గూఢచారి సంస్థ (NIS) శాసనసభ్యులకు అందించిన సమాచారంలో, జూ ఏ ఇప్పటివరకు కేవలం “వారసత్వ శిక్షణ” దశలో కాకుండా, ఇప్పుడు “అధికారిక వారసురాలు” దశలోకి ప్రవేశించినట్లు పేర్కొంది. ఆమె వయస్సు సుమారు 13 సంవత్సరాలుగా అంచనా వేస్తున్నారు. 2022 నుంచి జూ ఏ తన తండ్రితో కలిసి పలు ముఖ్య ప్రజా కార్యక్రమాల్లో కనిపించడం ప్రారంభించింది.

2025లో ఈ రకమైన ప్రజల ఎదుటకు రావడం మరింత పెరిగింది. ముఖ్యంగా బీజింగ్‌కు జరిగిన ఆమె తొలి విదేశీ పర్యటన విశేష ప్రాధాన్యం సంతరించుకుంది. క్షిపణి పరీక్షలు, సైనిక తనిఖీలు, ప్రభుత్వ కార్యక్రమాల్లో ఆమె నిరంతరం కనిపించడం ద్వారా భవిష్యత్తు నాయకురాలిగా ప్రజలకు పరిచయం చేయాలనే వ్యూహం అమలు చేస్తున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.

అయితే, పురుషాధిక్య రాజకీయ వ్యవస్థలో అనుభవం లేని యువతి నాయకత్వం చేపట్టడం సవాళ్లతో కూడుకున్నదని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా అధికార పార్టీ వర్కర్స్ పార్టీ ఆఫ్ కొరియాలో కీలక స్థానంలో ఉన్న కిమ్ యో జాంగ్ బలమైన ప్రత్యర్థిగా ఎదిగే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు. ఆమె ఇప్పటికే పార్టీ, సైన్యంలో తన ప్రభావాన్ని బలపరుచుకున్నట్లు తెలుస్తోంది.

మాజీ దక్షిణ కొరియా గూఢచారి అధికారి రా జాంగ్ ఇల్ హెచ్చరికల ప్రకారం, జూ ఏను అధికారికంగా వారసురాలిగా ప్రకటిస్తే, అత్త–కోడళ్ల మధ్య తీవ్రమైన అధికార పోరు తలెత్తే ప్రమాదం ఉంది. ఉత్తర కొరియా రాజకీయ చరిత్రలో అంతర్గత విభేదాలు హింసాత్మక పరిణామాలకు దారితీసిన ఘటనలు ఉన్నాయి.

కిమ్ జాంగ్ ఉన్ తన మామను మరణశిక్ష విధించడం, తన సవతి అన్నను హత్య చేయించడం వంటి ఘటనలు అక్కడ అధికార పోరాటం ఎంత కఠినంగా ఉండొచ్చో సూచిస్తున్నాయి. ఈ పరిణామాలు ఉత్తర కొరియా భవిష్యత్తు రాజకీయ దిశపై అంతర్జాతీయంగా ఆసక్తి రేకెత్తిస్తున్నాయి.

Related posts

రాఖీ పౌర్ణమి స్పెషల్ బస్సుల్లో ఛార్జీలు పెంచారా?

Satyam News

బోనాల ఉత్సవానికి గవర్నర్ కు ఆహ్వానం

Satyam News

డీలిమిటేషన్‌తో దక్షిణాది రాష్ట్రాలకు తీరని అన్యాయం

Satyam News

సామాన్యుడిలా మెట్రోలో మంత్రి జూపల్లి ప్రయాణం

Satyam News

ప్రశ్నించే హక్కా? హద్దులు లేని ప్రవర్తనా?

Satyam News

చరిత్ర సృష్టించిన మహిళా క్రికెట్ జట్టు

Satyam News

Leave a Comment