26.3 C
Hyderabad
September 19, 2026
రంగారెడ్డిహోమ్

తీవ్ర రూపం దాల్చిన బోడుప్పల్ వక్ఫ్ భూముల సమస్య

మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ బోడుప్పల్  పరిధిలో వక్ఫ్ బోర్డు భూముల వివాదం మరోసారి తీవ్రరూపం దాల్చింది. తమ నివాస ప్రాంతాలను వక్ఫ్ బోర్డు జాబితాలో చేర్చి రిజిస్ట్రేషన్లను నిలిపివేయడాన్ని నిరసిస్తూ వివిధ కాలనీల వాసులు భారీ ర్యాలీ నిర్వహించారు.

రిజిస్ట్రేషన్ల పోరాట సమితి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మహిళలు, చిన్న పిల్లలు మరియు కాలనీ సంక్షేమ సంఘాల ప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొని ప్రభుత్వానికి తమ ఆవేదనను విన్నవించుకున్నారు. 2015 నుంచి ఈ ప్రాంతంలో రిజిస్ట్రేషన్లు నిలిచిపోవడంతో సుమారు 10 వేల కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని, తమ సొంత ఇళ్లపై హక్కులు లేక రోడ్డున పడే పరిస్థితి వచ్చిందని బాధితులు ఆందోళన వ్యక్తం చేశారు.

గతంలో ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తమ సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని, కానీ అధికారంలోకి వచ్చాక ఆ మాట మరచిపోయారని బాధితులు మండిపడ్డారు.

అనేక మార్లు అధికార మరియు ప్రతిపక్ష పార్టీల నేతలకు విన్నవించినా ఫలితం లేదని, తమ సమస్యను గాలికి వదిలేశారని ఆరోపించారు. ప్లాట్లు కొనుగోలు చేసిన సమయంలో లేని వివాదాలను ఇప్పుడు తెరపైకి తెచ్చి సామాన్యులను ఇబ్బంది పెట్టడం సరికాదని, తక్షణమే వక్ఫ్ బోర్డు నిషేధిత జాబితా నుండి తమ కాలనీలను తొలగించి రిజిస్ట్రేషన్ ప్రక్రియను పునరుద్ధరించాలని వారు డిమాండ్ చేశారు.

Related posts

చరిత్రలో రథసప్తమి….. ప్రత్యేకత

Satyam News

నరసరావుపేటలో స్వీయ జనగణన అవగాహనకు 5కే రన్

Satyam News

పంచముఖ ఆంజనేయ స్వామి ఫోటోఉంటే అన్నీ మంచి ఫలితాలే

Satyam News

మహిళా అధికారిని బ్లాక్ మెయిల్ చేసిన జర్నలిస్టులు

Satyam News

‘ప్రభుత్వ సారాయి దుకాణం’ చిత్ర టీజర్ లాంచ్

Satyam News

కొడుకు సంతానానికి తల్లిగా మారిన తల్లి…….?

Satyam News

Leave a Comment