26.3 C
Hyderabad
September 19, 2026
ప్రత్యేకంహోమ్

బ్రెజిల్ లో లిథియం మైనింగ్ కి సింగరేణి

తాము చేపట్టిన లిథియం మైనింగ్ లో సింగరేణి సంస్థ భాగస్వామిగా చేరాలని కోరుతూ బ్రెజిల్ దేశానికి చెందిన ప్రముఖ సి.బి.ఎల్ సంస్థ ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం సింగరేణి ఛైర్మన్, ఎండీ డాక్ట‌ర్‌ బుద్దప్రకాష్ జ్యోతిని కలిసి వివరాలను తెలియజేసింది.

సి.బి.ఎల్ (కంపాన్హియా బ్రసిలీరా డి లిటియో) బోర్డు డైరెక్టర్ డేనియల్ లెమే, సి.బి.ఎల్ సీఈవో వినీసియస్ అల్వారెంగా తమ కంపెనీ వివరాలను తెలియజేశారు. బ్రెజిల్ దేశంలో ఇప్పటికే తాము లిథియం మైనింగ్ చేపట్టామని, సింగరేణి సంస్థ కీలక ఖనిజాల పట్ల ఆసక్తితో ఉన్న నేపథ్యంలో తమ కంపెనీలో భాగస్వామిగా చేరినట్లయితే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని వారు వివరించారు. తాము సింగరేణి తో పాటు దేశంలోని ప్రముఖ కంపెనీలను కూడా సంప్రదిస్తున్నామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా నేడు ప్రపంచంలో లిథియం కీలక ఖనిజానికి ఉన్న ప్రాధాన్యత, వ్యాపార కోణంలో ఉన్న లాభదాయకత గురించి వివరించారు.

సింగరేణి సంస్థకు సంబంధించిన వివరాలను డైరెక్టర్ ప్రాజెక్ట్స్ అండ్ ప్లానింగ్ కె. వెంకటేశ్వర్లు, డైరెక్టర్ పర్సనల్ మరియు ఫైనాన్స్ గౌతమ్ పోట్రు వివరించారు. బ్రెజిల్ దేశంలో కీలక ఖనిజ అవకాశాలను, లాభదాయకత తదితర అంశాలను తాము చర్చించి నిర్ణయం తీసుకుంటామని సింగరేణి ఉన్నతాధికారులు పేర్కొన్నారు.

Related posts

జమ్మూలో బీజేపీ అభ్యర్ధి ఘన విజయం

Satyam News

ట్రాన్స్‌జెండర్లకు రాజకీయ సాధికారతకు శ్రీకారం

Satyam News

కారుణ్య మ‌ర‌ణాల‌కు ఇక మార్గం సుగ‌మం

Satyam News

డెమోగ్రఫీ మిషన్ ప్రారంభిస్తున్నాం…

Satyam News

అహోబిలం పారువేట ఉత్సవంకు యూనెస్కో గుర్తింపు

Satyam News

జగన్ రెడ్డికి సంక్రాంతి సందేశం

Satyam News

Leave a Comment