చిత్తూరుహోమ్

త్వరలో మేడిన్‌ ఆంధ్రా షిప్స్…. ఏపీలో షిప్‌ బిల్డింగ్‌ క్లస్టర్‌

#ShipBuilding

కియా మోటార్స్‌ రాకతో మేడిన్ ఆంధ్రా కార్లను చూశారు.. త్వరలో మేడిన్‌ ఆంధ్రా నౌకలు నిజం కాబోతున్నాయి. తిరుపతి జిల్లా దుగరాజపట్నం పోర్టు కేంద్రంగా నౌకా నిర్మాణ క్లస్టర్‌ ఏర్పాటు చేయడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పెషల్‌ పర్సస్‌ వెహికిల్‌ను ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్‌ మారిటైమ్‌ బోర్డు, విశాఖపట్నం పోర్టు భాగస్వామ్యంలో ఈ ఎస్పీవీ పని చేస్తుంది. ఇందులో మారిటైమ్‌ బోర్డు ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి 50 శాతం.. విశాఖ పోర్టు రూపంలో కేంద్ర సర్కారుకి 50 శాతం వాటా ఉంటాయి. పెట్టుబడికి అవసరమైన నిధులు వంద శాతం కేంద్రం గ్రాంట్‌ రూపంలో అందించనుంది.

నేషనల్‌ షిప్‌ బిల్డింగ్‌ అండ్‌ హెవీ ఇండస్ట్రీస్‌ పార్క్‌.. NSHIP- ఆంధ్రప్రదేశ్‌ పేరుతో ఏర్పాటు చేసిన జాయింట్‌ వెంచర్‌ ద్వారా.. దుగరాజపట్నంలో గ్రీన్‌ ఫీల్డ్‌ పోర్టుతో పాటు.. నౌకా నిర్మాణ పరిశ్రమ ఏర్పాటుకు ప్లానింగ్, అభివృద్ధి చేసి పనులు ప్రారంభించేలా చూస్తారు. ఇక్కడ షిప్‌ బిల్డింగ్‌ యూనిట్‌తో పాటు నౌకల మరమ్మత్తులు, హెవీ ఇంజనీరింగ్‌ సంస్థలు, ఇతర మౌళిక వసతుల కంపెనీలు వస్తాయని ఏపీ ప్రభుత్వం తెలియజేసింది.

దేశంలో నౌకా నిర్మాణ పరిశ్రమ అభివృద్ధి పథకం కింద కేంద్ర ప్రభుత్వం సుమారు 20 వేల కోట్ల రూపాయలు కేటాయించింది. వివిధ రాష్ట్రాల్లో నాలుగు చోట్ల మెగా షిప్‌ బిల్డింగ్‌ క్లస్టర్ల నిర్మాణానికి ఈ నిధులు వినియోగిస్తారు. అంటే ఏపీలో ఏర్పాటు చేసిన ఎస్పీవీకి దాదాపు 5 వేల కోట్ల రూపాయల నిధులు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటి వరకు తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలు మాత్రమే NSHIP స్కీమ్‌ కింద నౌకా నిర్మాణ క్లస్టర్ల ఏర్పాటుకి ఎస్పీవీలు ఏర్పాటు చేశాయి. దుగరాజపట్నంతో పాటు కృష్ణా జిల్లా మచిలీపట్నం, శ్రీకాకుళం జిల్లా మూలపేట పోర్టుల్లో భారీ నౌకలు నిర్మించే పరిశ్రమలు ఏర్పాటు చేయాలని కూటమి ప్రభుత్వం ప్లాన్‌ చేస్తోంది.

రాష్ట్రంలో, దేశంలో పారిశ్రామిక అభివృద్ధి జోరుగా సాగుతోంది. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న పరిశ్రమలు పనులు ప్రారంభించి పెద్ద ఎత్తున వస్తువులు ఉత్పత్తి చేస్తే వాటిని విదేశాలకు ఎగుమతి చేయడానికి భారీ సంఖ్యలో నౌకలు అవసరం అవుతాయి. ప్రస్తుతం మనం చైనా, యూరోప్ దేశాల నౌకల మీదే ఎక్కువగా ఆధారపడుతున్నాం. ఇతరుల మీద ఆధారపడకుండా దేశీయంగా సొంత షిప్పింగ్‌ పరిశ్రమను అభివృద్ధి చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రణాళికలో భాగంగానే ఏపీలో భారీ షిప్‌ బిల్డింగ్‌ క్లస్టర్‌కు ఆమోదం లభించింది. ఈ ప్రాజెక్టు పూర్తయితే.. మేడిన్‌ ఆంధ్రా నౌకలు రాష్ట్ర ఇండస్ట్రియల్‌ డెవలప్‌మెంట్‌ని పరుగులు పెట్టించి.. మన ఉత్పత్తులను ప్రపంచం నలుమూలలకు చేరవేస్తాయి.

Related posts

కొనసాగుతున్న ఉపరితల ఆవర్తన

Satyam News

వంటగ్యాస్ రాలేదా? ఇవిగో కొత్త గైడ్ లైన్స్

Satyam News

‘లూయిస్ వ్యూట్టన్’లో రాజ్ దాసిరెడ్డి సందడి

Satyam News

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దాడి వెనుక పిన్నెల్లి సోదరులు?

Satyam News

అంతులేని కథ కు 50 ఏళ్లు

Satyam News

అణు పరీక్షలకు సిద్ధమైన పాకిస్తాన్?

Satyam News

Leave a Comment