ప్రత్యేకంహోమ్

13 ఏళ్ల లోపు పిల్లలకు నో సోషల్ మీడియా

#Chandrababu

ఆంధ్రప్రదేశ్‌లో 13 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా వినియోగంపై ఆంక్షలు విధించే అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఈ విషయాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అసెంబ్లీలో వెల్లడించారు.

ఆంధ్రప్రదేశ్ శాసనసభలో మాట్లాడిన ఆయన, 13 సంవత్సరాల లోపు పిల్లలు సోషల్ మీడియాను ఉపయోగించకుండా నిరోధించే కార్యక్రమాన్ని త్వరలో ప్రారంభించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఈ ప్రతిపాదనను ఐటీ మంత్రి నారా లోకేష్ సూచించారని పేర్కొన్నారు. వచ్చే 90 రోజుల్లోపు ఈ కార్యక్రమాన్ని అమలు చేసే అవకాశముందని చెప్పారు.

అదే సమయంలో 13 నుంచి 16 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న పిల్లల సోషల్ మీడియా వినియోగంపై కూడా కొన్ని నియంత్రణలు తీసుకురావాలనే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ విషయంలో విస్తృతంగా చర్చించి, అన్ని వర్గాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని తుది నిర్ణయం తీసుకుంటామని అన్నారు.

పిల్లలు సోషల్ మీడియా ప్రభావం వల్ల ప్రతికూల ప్రభావాలకు గురికాకుండా చూడటం ప్రభుత్వ బాధ్యత అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. వారి మానసిక ఆరోగ్యం, భద్రత దృష్ట్యా అవసరమైన చర్యలు తీసుకుని పిల్లల సంక్షేమాన్ని కాపాడేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు.

Related posts

టైర్ పేలి కారు బోల్తా

Satyam News

నారా లోకేష్‌కు మోదీ ‘సూపర్ ప్రశంస’!

Satyam News

మనసు దోచుకున్న మహిళా క్రికెటర్లు

Satyam News

అమరావతికి కేంద్రం వరాలు: సెంట్రల్ సెక్రటేరియేట్ నిర్మాణం

Satyam News

తిరుమల శ్రీవారి పై కోపంతో కాశీబుగ్గ ఆలయ నిర్మాణం?

Satyam News

పాకిస్తాన్ ను చావుదెబ్బ కొట్టాం

Satyam News

Leave a Comment