26.7 C
Hyderabad
September 20, 2026
కరీంనగర్హోమ్

మహిళా సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తున్నాం

#PonnamPrabhakar

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలోని అక్కాచెల్లెళ్లకు మరియు ఆర్టీసీ మహిళా సిబ్బందికి రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ప్రజా పాలన ప్రభుత్వం కొలువుదీరిన 48 గంటల్లోనే మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించామని, తద్వారా మహిళలను బస్సులకు యజమానులను చేశామని ఆయన పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తోందని, మహిళలు అన్ని రంగాల్లో రాణించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని ఆయన ఆకాంక్షించారు.

మహాలక్ష్మి పథకం ద్వారా ఇప్పటివరకు మహిళలు సుమారు 282 కోట్ల జీరో టికెట్ ప్రయాణాలు చేశారని, దీనివల్ల వారు దాదాపు 9,700 కోట్ల రూపాయలను ఆదా చేసుకున్నారని మంత్రి వివరించారు. మహిళా సాధికారతను మరింత బలోపేతం చేసేందుకు మండల మహిళా సమాఖ్యల ద్వారా కొత్త బస్సుల కొనుగోలు ప్రక్రియను చేపట్టామని తెలిపారు. రాష్ట్రంలోని కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే మహోన్నత లక్ష్యంతో ప్రభుత్వం పని చేస్తోందని, ఇందులో భాగంగా ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లు, వడ్డీ లేని రుణాలు, స్వయం సహాయక సంఘాలకు ఉపాధి అవకాశాల కల్పన వంటి ఎన్నో పథకాలకు శ్రీకారం చుట్టినట్లు వెల్లడించారు.

మహిళా సంక్షేమమే కేంద్రంగా 200 యూనిట్ల ఉచిత విద్యుత్, సన్న బియ్యం పంపిణీ, నూతన రేషన్ కార్డుల మంజూరు వంటి ప్రజాహిత కార్యక్రమాలను అమలు చేస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ గుర్తుచేశారు. మహిళలు ఆర్థిక వృద్ధి సాధించి, సమాజంలో గౌరవప్రదంగా ఎదగాలన్నదే ప్రభుత్వ సంకల్పమని పేర్కొంటూ, తన సోదరీమణులందరికీ మరోమారు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.

Related posts

ఆటో డ్రైవర్ల పట్ల చంద్రబాబుకు ఈ అకస్మాత్తు ప్రేమ ఎందుకు?

Satyam News

గంజాయి రహిత సమాజమే మా లక్ష్యం

Satyam News

అమరావతిలో గ్రంథాలయం కోసం రూ.100 కోట్ల విరాళం

Satyam News

భారత్‌ కు పాకిస్తాన్ రక్షణ మంత్రి హెచ్చరిక

Satyam News

విజయవాడ-తాడేపల్లి మధ్య వందల కార్లు చక్కర్లు..పవన్‌,లోకేష్‌ షాక్!

Satyam News

పాకిస్తాన్ ను చావుదెబ్బ కొట్టాం

Satyam News

Leave a Comment