25.7 C
Hyderabad
September 21, 2026
విశాఖపట్నంహోమ్

గంజాయి రహిత సమాజమే మా లక్ష్యం

కూక‌టి వేళ్ల‌తో గంజాయి నిర్మూల‌నను పోలీస్ శాఖ చేప‌డుతోంద‌ని విశాఖ రేంజ్ డీఐజీ గోపీనాధ్ జెట్టి బుధ‌వారం అన్నారు. పోలీస్ రేంజ్ ప‌రిదిలో ఐదు జిల్లాల ఎస్పీల‌తో డీఐజీ గోపీనాధ్ జెట్టి స‌మీక్షించి 20 నెల‌ల ప్ర‌గ‌తి నివేదిక‌ను వెల్ల‌డించారు.

జూన్ 2024 నుండి జనవరి 2026 వరకు రేంజ్ వ్యాప్తంగా ఐదు జిల్లాలో సాగిన గంజాయి వ్యతిరేక పోరాట వివరాలను వారు వివరించారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో 451 కేసులకు సంబంధించి 35,268.374 కిలోల గంజాయి, 132.157 లీటర్ల హషీష్ ఆయిల్ ను,అనకాపల్లి జిల్లాలో 332 కేసులకు సంబంధించి 17,068.24 కిలోల గంజాయి, 10.03 లీటర్ల హషీష్ ఆయిల్,అనకాపల్లి , అల్లూరు సీతారామరాజు జిల్లాలతో కలిపి 783 కేసులలో 52,336.614 కిలోల గంజాయి 142.187 మీటర్ల హసిష్ ఆయిల్ ను ధ్వంసం చేయ‌డం జ‌రిగింద‌న్నారు.

మొత్తం 24 అంతర్రాష్ట్ర ముఠాలను గుర్తించి, 129 మంది సభ్యులపై నిరంతర నిఘా ఉంచామ‌న్నారు. వారి ఆర్థిక మూలాల పై దెబ్బ తీసే విదంగా సుమారు రూ. 9.19 కోట్ల ఆస్తుల జప్తు చేసామ‌న్నారు. ఇప్పటివరకు 14 మంది ప్రధాన నిందితులకు సంబంధించి రూ. 9,19,17,290/- విలువైన ఆస్తులను గుర్తించి, వాటిని ఫ్రీజ్ చేస్తూ కన్ఫర్మేషన్ ఉత్తర్వులు జారీ చేశామ‌న్నారు.

యువ‌త మ‌త్తుకు బానిస‌లు కావొద్ద‌ని బంగారు భ‌విష్య‌త్ ను అంధ‌కారంలో నెట్టేయొద్ద‌ని,క‌న్న‌వారి ఆశ‌యాల‌ను నీరు కార్చొద్ద‌ని ఈ సంద‌ర్బంగా రేంజ్ డీఐజీ గోపీనాధ్ జెట్టి కోరారు.

ఈ కార్యక్రమంలో అనకాపల్లి జిల్లా అదనపు ఎస్పీలు ఎం.దేవ ప్రసాద్, ఎల్.మోహనరావు, డీఎస్పీలు జి.ఆర్.ఆర్.మోహన్, వి.విష్ణు స్వరూప్, ఎం.శ్రావణి, పి.శ్రీనివాసరావు, బి.మోహనరావు, పరవాడ ఇన్స్పెక్టర్ ఆర్.మల్లికార్జునరావు, ఎస్.బి ఇన్స్పెక్టర్ ఎస్.బాల సూర్యరావు, అనకాపల్లి. అల్లూరి సీతారామరాజు జిల్లాల పోలీస్ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.

Related posts

మళ్లీ బీజేపీ రాజకీయాల్లోకి వరుణ్ గాంధీ?

Satyam News

భవన నిర్మాణ అనుమతుల సరళీకరణకు క్రెడాయ్ ప్రశంసలు

Satyam News

విక్రమ సింహపురి విశ్వవిద్యాలయంలో ఘనంగా యోగా దినోత్సవం

Satyam News

ధర్మేంద్ర కేవలం భర్త మాత్రమే కాదు….

Satyam News

జలం విలువ తెలియని జగన్ చేసిన నష్టం ఇదీ…..

Satyam News

మార్చి 26న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ రిలీజ్ డేట్ ఫిక్స్

Satyam News

Leave a Comment