26.3 C
Hyderabad
September 19, 2026
గుంటూరుహోమ్

నేర ప్రవృత్తిని విడనాడి మంచి పౌరులుగా జీవించండి

రౌడీ షీటర్లు మరియు నేర చరిత్ర గల వారి కదిలికలపై నిరంతరం నిఘా ఉంటుందని పల్నాడు జిల్లా ఎస్పీ బి. కృష్ణారావు స్పష్టం చేశారు. ఎవరైనా చట్ట వ్యతిరేక కార్యకలాపాలలో పాల్గొంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

ఎస్పీ కృష్ణారావు ఆదేశాల మేరకు పల్నాడు జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ ల పరిధులలో రౌడీషీటర్లు, నేరచరిత్ర కలవారికి పోలీస్ అధికారులు ఆదివారం కౌన్సిలింగ్ నిర్వహించడం జరిగింది. రౌడీ షీట్లు కలిగిన వ్యక్తుల ప్రవర్తన, వారు నిర్వహించే పనులు, వారి జీవన విధానంపై నిఘా ఉంటుందని పోలీసు అధికారులు తెలియజేశారు. సత్ప్రవర్తనతో జీవించాలని, నేర ప్రవృత్తిని మానుకొని సమాజంలో మంచి పౌరులుగా జీవించాలని సూచించారు.

చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని, ఎవరైనా పోలీస్ వారి సూచనలను బేఖాతరు చెస్తే, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలలో పాల్గొంటే తప్పనిసరిగా చట్ట ప్రకారం కఠినమైన చర్యలు తీసుకుంటామన్నారు.

అంతేకాకుండా గంజాయి మరియు ఇతర మత్తు పదార్థాల వినియోగం అక్రమ రవాణా చేయకుండా ఉండాలని తెలిపారు. ప్రతి ఒక్కరు చెడు వ్యసనాలు దూరం చేసుకుని మంచి ప్రవర్తనతో మెలగాలని సూచించారు. ఎవరైనా గొడవలు, లేదా నేరాలలో పాల్గొంటే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని పోలీసు అధికారులు హెచ్చరించారు.

Related posts

ప్రభుత్వ పథకాల అమలులో జిల్లా కలెక్టర్ సేవలు ప్రశంసనీయం

Satyam News

కళ్లార్పకుండా అబద్ధాలు చెప్పిన జగన్ రెడ్డి

Satyam News

డ్రగ్స్, మానవ అక్రమ రవాణ నిరోధంలో ఎస్ఎస్ బి సేవలు భేష్

Satyam News

పోలీసులు నిలబెట్టిన కాపురం

Satyam News

ఒంటిమిట్ట అభివృద్ధికి సమగ్ర ప్రణాళిక

Satyam News

విద్యార్థిని పుర్రె ఎముకకు గాయమయ్యేలా కొట్టడం దారుణం

Satyam News

Leave a Comment