26.3 C
Hyderabad
September 19, 2026
ఆధ్యాత్మికంహోమ్

తిరుమలలో ‘కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం’

#Tirumala

శ్రీవారి పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమలలో ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని అత్యంత వైభవంగా ‘కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం’ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాల్ దీక్షితులు తెలిపారు.

ఉగాది వేడుకలకు ముందుగా ఆలయ శుద్ధిలో భాగంగా గర్భాలయంలోని మూలమూర్తికి వస్త్ర ఆచ్ఛాదన చేసి, గర్భాలయ గోడలతో పాటు ఉపాలయాలను ‘పరిమళం’ అనే ప్రత్యేక సుగంధ ద్రవ్యంతో లేపనం చేసినట్లు ఆయన వివరించారు.

ఈ పరిమళ ద్రవ్యాన్ని మేళతాళాల మధ్య మంగళవాయిద్యాల తోడుగా ఆలయానికి తీసుకువచ్చి శుద్ధి ప్రక్రియను పూర్తి చేశారు. ఉగాది రోజున శ్రీవారికి వజ్రాభరణాలతో విశేష అలంకరణ చేసి, ఉగాది ఆస్థానం సందర్భంగా బంగారు వాకిలి వద్ద శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారిని సర్వభూపాల వాహనంపై వేంచేపు చేస్తారు.

సంప్రదాయబద్ధంగా మేళతాళాలతో కొత్త పట్టువస్త్రాలను ఊరేగింపుగా తీసుకువచ్చి మూలమూర్తితో పాటు ఉత్సవమూర్తులకు సమర్పిస్తారని, అనంతరం బంగారు వాకిలిలో పంచముఖాల కొలువు మరియు పంచాంగ శ్రవణం కార్యక్రమాలు అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తామని ఆయన పేర్కొన్నారు.

ఉగాది వేడుకల కారణంగా శ్రీవారి ఆలయంలో నిర్వహించే అన్ని రకాల ఆర్జిత సేవలను రద్దు చేసినట్లు ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

Related posts

పద్మశ్రీ సిరివెన్నెల సీతారామశాస్త్రి కాంస్య విగ్రహవిష్కరణ

Satyam News

కూటమి ప్రభుత్వ సూపర్ సిక్స్… సూపర్ హిట్

Satyam News

వనపర్తిలో లక్షల్లో అద్దె-వేలల్లో టాక్స్

Satyam News

మెడికల్ మాఫియా అక్రమాలపై చర్యలు తీసుకోండి

Satyam News

ఉత్తరాంధ్ర, రాయలసీమల్లో….. వైసీపీని పేల్చేసిన.. మావిగన్‌..!!

Satyam News

టారిఫ్ లను వ్యతిరేకించేవారు ఫూల్స్

Satyam News

Leave a Comment