25.2 C
Hyderabad
September 20, 2026
ప్రత్యేకంహోమ్

జగన్‌-భారతి స్కెచ్‌కు విజయమ్మ బ్రేకులు..ఆస్తి వివాదంలో ట్విస్ట్‌!

#Jagan

వైఎస్సార్ ఫ్యామిలీలో ఆస్తుల వివాదం ఇప్పుడు క్లైమాక్స్‌కు చేరింది. ఇన్నాళ్లూ మౌనంగా ఉన్న వై.ఎస్‌. విజయమ్మ..మాజీ సీఎం, తన కుమారుడు జగన్‌మోహన్ రెడ్డి వేసిన ఎత్తుగడలపై నేరుగా రంగంలోకి దిగారు. NCLAT చెన్నై బెంచ్‌కు విజయమ్మ సమర్పించిన నివేదిక ఇప్పుడు పొలిటికల్, ఇండస్ట్రియల్ వర్గాల్లో సంచలనంగా మారింది.

విజయమ్మ తన కౌంటర్‌లో కొడుకు జగన్, కోడలు భారతిల డబుల్ స్టాండర్డ్స్‌ను ఎండగట్టారు. 2019 ఒప్పందం ప్రకారం సరస్వతి పవర్ వాటాలన్నీ షర్మిలకు చెందాల్సి ఉండగా, ప్రత్యామ్నాయంగా వాటిని విజయమ్మ పేరుకు బదిలీ చేసేందుకు జగన్ దంపతులు అంగీకరించారు. అయితే, ఇప్పుడు ED జప్తు సాకుతో ఆ వాటాల బదిలీని అడ్డుకోవాలనుకోవడం కుట్రేనని విజయమ్మ తేల్చి చెప్పారు.

ఈ సందర్భంగా జగన్‌కు నేరుగా కొన్ని ప్రశ్నలు సంధించారు విజయమ్మ. సండూర్, క్లాసిక్ రియాల్టీలోని వాటాల బదలాయింపును ప్రశ్నించని జగన్, కేవలం సరస్వతి పవర్ విషయంలోనే ED జప్తును ఎందుకు తెరపైకి తెచ్చారని ప్రశ్నించారు. వాటా సర్టిఫికెట్లు, బదిలీ పత్రాలు స్వయంగా అందజేసిన తర్వాత, ఇప్పుడు మాట తప్పడం, మడమ తిప్పడం వెనుక పెద్ద స్కెచ్ ఉందని ఆమె ఆరోపించారు.

తనపై వస్తున్న ఆరోపణలకు విజయమ్మ తన లేఖతో సమాధానమిచ్చారు. నేను స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుంటున్నాను. షర్మిలకు బినామీగానో, ప్రతినిధిగానో నేను వ్యవహరించడం లేదంటూ జగన్‌కు చురకలు అంటించారు విజయమ్మ. క్లాసిక్ రియాల్టీకి తగిన ప్రతిఫలం చెల్లించి తాను వాటాలను కొనుగోలు చేశానని, ఆ ఒప్పంద పత్రాలను ఎవరూ తిరస్కరించలేరని స్పష్టం చేశారు. తనపై ఉన్న ప్రేమను జగన్‌ నిరాకరించలేడని చెబుతూనే, చట్టపరంగా తనకున్న హక్కులను వదులుకోనని ఆమె నివేదించారు.

మరోవైపు వైఎస్ షర్మిల కూడా తన కౌంటర్‌లో తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తండ్రి వైఎస్సార్ ఆశయాలను, వారసత్వాన్ని గౌరవించి కుటుంబ సభ్యుల మధ్య జరిగిన అవగాహనకు జగన్ రాజకీయ రంగు పులుముతున్నారని ఆమె ఆరోపించారు. రాజకీయ కక్షలు తీర్చుకోవడంలో భాగంగానే తన పేరును ఈ వివాదంలోకి లాగారని షర్మిల పేర్కొన్నారు. ఒప్పందాలతో సంబంధం లేని విషయాలను తెరపైకి తెచ్చి, ఊహాజనిత ఆరోపణలు చేస్తూ తనను ఇబ్బంది పెడుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

NCLATలో విజయమ్మ, షర్మిల దాఖలు చేసిన ఈ కౌంటర్లు జగన్ వాదనలకు గట్టి షాక్ అనే చెప్పాలి. గిఫ్ట్ డీడ్‌లు, వాటా కొనుగోలు ఒప్పందాలు చెల్లుతాయని, జగన్ పాత్ర ఎప్పుడో ముగిసిపోయిందని విజయమ్మ వాదిస్తుండటంతో ఈ కేసు ఏప్రిల్ 29న ఏ మలుపు తిరుగుతుందోనన్నది ఆసక్తికరంగా మారింది.

Related posts

ఈవీ బస్సు ‘పల్లె వెలుగు’ అయినా ఏసీనే

Satyam News

తిరుమలలోని పలు ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు

Satyam News

నమ్మిన భక్తుల కల్పతరువు శ్రీ తిమ్మప్ప స్వామి

Satyam News

తప్పుడు ప్రచారం చేస్తున్న జగన్ పార్టీ నేతలపై చర్యలు

Satyam News

నందమూరి బాలకృష్ణ చొరవతో జాబ్ మేళా

Satyam News

నాగర్ దొడ్డి గ్రామ వాసికి డాక్టరేట్

Satyam News

Leave a Comment