ప్రత్యేకంహోమ్

పొరుగు దేశాలపై ఇరాన్ ప్రతీకార దాడులు

#Isreal

ఇరాన్‌కు చెందిన ప్రముఖ నాయకుల్లో ఒకరిని వైమానిక దాడిలో హతమార్చిన తరువాత, బుధవారం ఇరాన్ తీవ్రంగా ప్రతిస్పందించింది. గల్ఫ్ ప్రాంతంలోని పొరుగు దేశాలు, ఇజ్రాయిల్‌పై దాడులు జరిపింది. ఆధునిక క్షిపణులను ఉపయోగించి వాయు రక్షణ వ్యవస్థలను దాటుకుని దాడులు చేయగా, టెల్ అవీవ్ సమీపంలో ఇద్దరు మరణించినట్లు సమాచారం.

మధ్యప్రాచ్యంలో యుద్ధ పరిస్థితులు ఇంకా ఉద్రిక్తంగానే కొనసాగుతున్నాయి. ఇజ్రాయిల్ కూడా లెబనాన్‌పై తీవ్ర ఒత్తిడిని కొనసాగిస్తోంది. ఇరాన్ మద్దతుతో ఉన్న హిజ్బుల్లా మిలిటెంట్లను లక్ష్యంగా చేసుకుని బీరూట్‌లోని అనేక అపార్ట్‌మెంట్ భవనాలపై దాడులు జరిపింది.

ఈ దాడుల్లో కనీసం ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. ఇరాన్‌లోని బుషెహర్ అణు విద్యుత్ కేంద్రంపై ఒక ప్రాజెక్టైల్ పడినప్పటికీ ఎలాంటి ప్రాణనష్టం లేదా ఆస్తి నష్టం జరగలేదని అంతర్జాతీయ అణు శక్తి సంస్థ (IAEA) తెలిపింది. ఇదే సమయంలో, ఇరాన్ న్యాయవ్యవస్థ చేసిన ప్రకటన ప్రకారం దక్షిణ ఇరాన్‌లో మరో దాడి జరిగింది.

ఫార్స్ ప్రావిన్స్‌లోని లారెస్టాన్ కౌంటీలో ఉన్న న్యాయవ్యవస్థ కార్యాలయం లక్ష్యంగా ఈ దాడి జరిగినట్లు మిజాన్ వార్తా సంస్థ వెల్లడించింది. ఈ దాడిలో న్యాయ సిబ్బంది, సాధారణ పౌరులు మరణించగా, మరికొందరు గాయపడ్డారు. అయితే ఇది వైమానిక దాడా లేదా మిలిటెంట్ల దాడా అన్నది ఇంకా స్పష్టత రాలేదు.

Related posts

రెండో అతిపెద్ద మెడికల్ హబ్‌ గా వరంగల్‌

Satyam News

67.47 లక్షల మందికి లబ్ధి…. లోకేష్‌ ఎమోషనల్ పోస్ట్‌!

Satyam News

రికార్డు స్థాయిలో సీఎంఆర్ఎఫ్ సహాయం

Satyam News

జమ్మూలో బీజేపీ అభ్యర్ధి ఘన విజయం

Satyam News

బద్రీనాథ్‌ కేదార్‌నాథ్‌ జాతీయ రహదారిపై రాకపోకలు బంద్

Satyam News

దొరల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన ఐలమ్మ

Satyam News

Leave a Comment