26.3 C
Hyderabad
September 19, 2026
చిత్తూరుహోమ్

4.14 కోట్లు పలికిన ఇందిరా ప్రియదర్శిని కూరగాయల మార్కెట్

#Tirupati

తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలోని ఇందిరా ప్రియదర్శిని కూరగాయల మార్కెట్ కు నిర్వహించిన వేలం పాటలో 4.14 కోట్లకు పలికిందని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్.మౌర్య తెలిపారు.

2026-2027 సంవత్సరానికి మంగళవారం నగరపాలక సంస్థ పరిధిలోని ఇందిరా ప్రియదర్శిని కూరగాయల మార్కెట్, రామచంద్ర గుంట కట్టపై ఉన్న పట్నూల్ వీధి కూరగాయల మార్కెట్ కు, జంతు వధశాలకు, గాంధీ రోడ్డు, తిలక్ రోడ్డు,  మాస్కు రోడ్డు, త్యాగరాజ మండపం, దేవేంద్ర థియేటర్ రోడ్డు, కేటి రోడ్డు మార్గముల యందు, హరే రామ హరే కృష్ణ రోడ్డు ఇరువైపులా, కపిల తీర్థం రోడ్డు జంక్షన్ పార్కింగ్, శ్రీనివాసం పక్కన పార్కింగ్ స్థలాలకు, గోవిందరాజ దక్షిణ, ఉత్తర మాడా వీధుల పార్కింగ్ స్థలాల లీజుకు మంగళవారం సీల్డు టెండర్లు, బహిరంగ వేలం నిర్వహించామని కమిషనర్ తెలిపారు.

ఇందిరా ప్రియదర్శిని కూరగాయల మార్కెట్ వేలంలో వై.గీత 4.14 కోట్ల రూపాయల హెచ్చు పాటతో దక్కించుకున్నారు. రామచంద్రగుంట కట్ట పట్నం వీధి కూరగాయల మార్కెట్ ను ముని రాజబాబు 3.30 లక్షల రూపాయల హెచ్చు పాటతో దక్కించుకున్నారు.

జంతు వధశాలను వి.గణేష్ 5.85 లక్షలు హెచ్చు పాటతో దక్కించుకున్నారు. గాంధీ రోడ్డు, తిలక్ రోడ్డు, మాస్క్ రోడ్డు, త్యాగరాజ మండపము, దేవేంద్ర థియేటర్ రోడ్డు, కె.టి. రోడ్డు, హరే రామ హరే కృష్ణ రోడ్డుకు ఇరువైపులా, కపిల తీర్థం రోడ్డు జంక్షన్ల యందు పార్కింగ్ వసూలు చేయుటకు నిర్వహించిన వేలంలో వి. గణేష్ 50.74 లక్షల రూపాయల హెచ్చు పాట పాడి దక్కించుకున్నారు.

శ్రీనివాసన్ పక్కనగల పార్కింగ్ స్థలము లో రుసుము వసూలుకు బాలాజీ 19.11 లక్షల రూపాయల హెచ్చు పాట పాడి దక్కించుకున్నారు. గోవిందరాజ ఉత్తర, దక్షిణ మాడ వీధుల్లో పార్కింగ్ రుసుము వసూలుకు రాధ 12.39 లక్షల రూపాయల హెచ్చు పాట పాడి దక్కించుకున్నారని తెలిపారు.

వేలం పాటలో హెచ్చు పాట పాడి మార్కెట్, తదితరాలను దక్కించుకున్న వారు నగరపాలక సంస్థ నియమనిబంధనలను తప్పక పాటించాలని కమిషనర్ తెలిపారు. ఈ వేలం పాటలో ట్రైనీ కలెక్టర్ రఘువంశీ, డిప్యూటీ కమిషనర్ అమరయ్య, రెవిన్యూ అధికారులు సేతు మాధవ్, రవి, తదితరులు పాల్గొన్నారు.

Related posts

భారత్ లో రూ.5.5 లక్షల కోట్ల పెట్టుబడికి జపాన్ సిద్ధం

Satyam News

మమతా బెనర్జీని దెబ్బతీసిన అహంకారం

Satyam News

బస్సు సేవలకు అడ్డంకులు సృష్టిస్తే కఠిన చర్యలు

Satyam News

హిందూ దేవాలయాలకు టిటిడి రాయితీలు

Satyam News

మోదీ-చంద్రబాబు భేటీ వెనుక అసలు కథ!

Satyam News

నరసాపురం లేసుల స్పెషాలిటీ: 25 ఏళ్ల క్రితమే చంద్రబాబు బ్రాండింగ్‌

Satyam News

Leave a Comment