26.3 C
Hyderabad
September 19, 2026
ముఖ్యంశాలుహోమ్

మొక్కజొన్న పంటను ప్రకటించిన ధరకే ప్రభుత్వం కొనుగోలు చేయాలి

పంచాయతీ ఎన్నికల్లో నామినేషన్లను అడ్డుకునేందుకే కూటమి ప్రభుత్వం సచివాలయాలను మారుస్తున్నారని వైసీపీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు. రొంపిచర్ల మండలంలోని తురుమెళ్ళ గ్రామ సచివాలయ మార్పు, నియోజకవర్గంలోని మొక్కజొన్న రైతుల సమస్యలపై సోమవారం జిల్లా కలెక్టరేట్ లో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో వైసీపీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, పల్నాడు జిల్లా కలెక్టర్ కృతిక శుక్లాకి వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా డాక్టర్ గోపిరెడ్డి మాట్లాడుతూ తురిమెళ్ళ గ్రామం సచివాలయ భవనాన్ని వైసీపీ ప్రభుత్వ హయాంలో 40 లక్షలతో నిర్మాణం చేశామన్నారు. గత నాలుగు సంవత్సరాలుగా అక్కడ సచివాలయ సిబ్బంది పనిచేస్తున్నారని, ఐతే కూటమి ప్రభుత్వం కుట్రపూరితంగా తురిమెళ్ళ సచివాలయ భవనాన్ని ఉన్నత వర్గాలకు చెందిన వారు అధికంగా నివసించే సుబ్బయ్యపాలెం గ్రామానికి మార్చడం దారుణమన్నారు.

ఇది కేవలం రాబోయే పంచాయతీ ఎన్నికల్లో తురిమెళ్ళ గ్రామస్తులు నామినేషన్లు వేయకుండా అడ్డుకోవడానీకేనని విమర్శించారు. ఈ విషయమై కలెక్టర్ ని వివరణ అడిగితే ప్రభుత్వం నుంచి మార్పుపై ఆర్డర్ వచ్చిందని చెబుతున్నారని అన్నారు. గతంలో కూడా సుబ్బయ్యపాలెం గ్రామానికి వెళ్లి వైస్ ప్రెసిడెంట్ ఎన్నికలలో పాల్గొనాల్సి వచ్చిందని తెలిపారు.

ప్రస్తుతం రాబోయే పంచాయతీ ఎన్నికల్లో తురుమెళ్ళ గ్రామస్తులు నామినేషన్ వేయకుండా అడ్డుకోవడమే లక్ష్యంగా ఈ సచివాలయాన్ని మార్పు చేశారని ఆరోపించారు. బడుగు, బలహీనవర్గాలు అధికంగా ఉండే తురిమెళ్ళ గ్రామ సచివాలయాన్ని సుబ్బయ్యపాలెం గ్రామానికి మార్చడం అక్రమమన్నారు. దీనిపై కోర్టుకు వెళ్తామన్నారు.

ఎం.ఎస్.పి ప్రకటించిన ధరకే మొక్కజొన్న పంటను ప్రభుత్వమే కొనుగోలు చేయాలి

రొంపిచర్ల మండలంలో అధిక శాతం రైతులు మొక్కజొన్న పంటను పండిస్తున్నారని క్వింటాకు రూ. 2400 మద్దతు ధరను ఎం.ఎస్.పి ప్రకటించిందన్నారు. ప్రకటించిన ధరకు కొనుగోలు చేయకుండా ప్రైవేట్ గా కేవలం రూ. 1600 మాత్రమే కొనుగోలు చేస్తున్నారనీ అన్నారు. తద్వారా ఒక్కొక్క రైతుకు ఎకరానికి 28 వేల నష్టం వస్తుందని, తక్షణమే ఎం.ఎస్.పి ప్రకటించిన ధరకు మొక్కజొన్న పంటను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లామని తెలిపారు.

గత వైసిపి హయాంలో ప్రతి గ్రామంలో ఆర్.బి.కే సెంటర్లను ఏర్పాటు చేసి వైయస్. జగన్మోహన్ రెడ్డి ప్రతి పంటకు సక్రమంగా మద్దతు ధరను అందించారని తెలిపారు. తక్షణమే ప్రభుత్వం మొక్కజొన్న పంట కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేసి ఎం.ఎస్.పి ప్రకటించిన రేటుకు మొక్కజొన్నను కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తురుమెళ్ళ గ్రామస్తులు మరియు వైసీపీ నాయకులు పాల్గొన్నారు.

Related posts

హనుమంత వాహనంపై శ్రీరామచంద్ర స్వరూపంలో గోకులానందుడు

Satyam News

యుద్ధ ప్రభావంతో కండోమ్ ల ధరల పెరుగుదల?

Satyam News

ఇది ప్రజాపాలన కాదు… దోపిడి దొంగల పాలన

Satyam News

భవిష్యత్తు కోసం ఎదురుచూడం… నిర్మిస్తాం

Satyam News

ఆడుకుంటూనే… గుండెపోటుతో చిన్నారి….

Satyam News

ఇమ్రాన్ ఖాన్ మృతిపై సంచలన పుకార్లు?

Satyam News

Leave a Comment