26.3 C
Hyderabad
September 19, 2026
హైదరాబాద్హోమ్

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన మేనకా గాంధీ

ప్రముఖ యానిమల్ రైట్స్ యాక్టివిస్ట్ మేనకా గాంధీ బృందం మర్యాదపూర్వకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. మున్సిపాలిటీల పరిధిలో వీధి కుక్కలకు చేసిన, చేయనున్న స్టెరిలైజేషన్ వివరాలను అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వారి బృందానికి వివరించారు.

గోసంరక్షణకు ప్రభుత్వం ఇప్పటికే ప్రణాళికలు రూపొందించిన విషయాన్ని ఆమెకు వివరించారు. ఎన్కేపల్లిలో గోశాల నిర్మాణానికి శంకుస్ధాపన చేసిన విషయాన్ని తెలిపారు. రాష్ట్రంలో వివిధ ఆలయాల సమీపంలో గోశాలల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు వివరించారు.

జంతు సంరక్షణ విషయంలో తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న చర్యల పట్ల మేనకా గాంధీ సంతృప్తి వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు.

Related posts

ఇక రాష్ట్రంలో ఆటోమేటిక్ టెస్టింగ్ స్టేషన్లు

Satyam News

దారుణ ప్రమాదం: ఏడుగురు మహిళలు మృతి

Satyam News

అయోధ్య నిధుల చోరీ కేసులో ఇద్దరు ఔట్

Satyam News

మునిసిపల్ చైర్మన్ ఆర్యవైశ్య మహిళ ఎన్నిక

Satyam News

“వడ్డే” కన్నా యూత్ దొరకలేదా?

Satyam News

ఇమ్రాన్ ఖాన్ మృతిపై సంచలన పుకార్లు?

Satyam News

Leave a Comment