25.2 C
Hyderabad
September 20, 2026
చిత్తూరుహోమ్

21 నెలల్లోనే 5.50 లక్షల ఇళ్లు..ఇది కూటమి రికార్డ్!

#CBN

ఏపీలో పేదల కల నెరవేరబోతుంది. ఎనిమిదేళ్లుగా కళ్లు కాయలు కాసేలా వేచి చూస్తున్న లక్షలాది మంది నిరీక్షణకు తెరదించుతూ, కూటమి ప్రభుత్వం చారిత్రాత్మక ఘట్టానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్రవ్యాప్తంగా సిద్ధమైన లక్ష టిడ్కో గృహాలతో పాటు, కాలనీల్లో పూర్తయిన మరో 1.50 లక్షల ఇళ్లు..ఇలా మొత్తం 2.50 లక్షల ఇళ్లను ఇవాళ లబ్ధిదారులకు అప్పగిస్తున్నారు.

తిరుపతి జిల్లా నాయుడుపేట మండలం పుదూరులో జరిగే ఈ సామూహిక గృహప్రవేశాల మహోత్సవంలో సీఎం చంద్రబాబు స్వయంగా పాల్గొని..పేద కుటుంబాల ఆత్మగౌరవాన్ని నిలబెట్టబోతున్నారు. అత్యాధునిక సౌకర్యాలతో నిర్మించిన ఈ ఇళ్లు చంద్రబాబు మార్క్ డెవలప్‌మెంట్‌కు నిదర్శనం. పార్కులు, జిమ్, సిమెంట్ రోడ్లతో అద్భుతంగా కాలనీలను తీర్చిదిద్దారు.

ఐదేళ్ల వైసీపీ ప్రభుత్వం కేవలం రంగులు వేసి ఆర్భాటం చేస్తూ, మౌలిక సదుపాయాలు కల్పించకుండా పేదలను అద్దె ఇళ్లలోనే మగ్గేలా చేసింది. అధికారంలోకి వచ్చిన కేవలం 21 నెలల స్వల్ప వ్యవధిలోనే అసంపూర్తిగా ఉన్న పనులను పూర్తి చేసి, రికార్డు స్థాయిలో నిధులు కేటాయించి గృహప్రవేశాలకు రూట్ క్లియర్ చేసింది కూటమి ప్రభుత్వం. గతేడాది పంపిణీ చేసిన 3 లక్షల ఇళ్లతో కలిపి, ఈ 21 నెలల్లోనే మొత్తం 5.50 లక్షల ఇళ్లను పూర్తి చేసి పేదలకు అప్పగించడం ఒక రికార్డు.

ఆర్థిక సవాళ్లు ఉన్నప్పటికీ ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారెంటీలను ఓ పక్క నెరవేరుస్తూనే మరోవైపు అభివృద్ధిని పరుగులు పెట్టిస్తోంది కూటమి ప్రభుత్వం. అభివృద్ధి, సంక్షేమాన్ని రెండు కళ్లుగా పాలన సాగిస్తోంది. ఇప్పటికే ఉచిత బస్సు ప్రయాణం, ఉచిత సిలిండర్లు, పెన్షన్ల పెంపు తదితర హామీలను నెరవేర్చింది.

Related posts

తెలంగాణ లో ‘‘సర్’’ అమలుపై చర్యలు

Satyam News

తగ్గుతున్న కరెంటు ఛార్జీలు…. మూడేళ్లలో బిల్లులు సగం..!!

Satyam News

లిక్కర్ స్కామ్‌లో సంచలనం..నెక్ట్స్‌ బిగ్‌బాస్.?

Satyam News

బెంగాల్ లో ముగిసిన మమత బెనర్జీ శకం?

Satyam News

మానవత్వం చాటుకున్న ఆలూరు ఎమ్మెల్యే

Satyam News

జర్నలిస్టుల రైల్వే పాసులు పునరుద్ధరించాలి

Satyam News

Leave a Comment