మహబూబ్ నగర్హోమ్

క్రీడాకారులు గెలుపు ఓటమి సమానంగా స్వీకరించాలి

గద్వాల జిల్లా కేంద్రంలోని ఇండోర్ స్టేడియం లో SGTU ఉపాధ్యాయులు ప్రీమియర్ లీగ్ సీజన్ -1 క్రికెట్ టోర్నమెంట్ ను ఎమ్మెల్యే బండ్ల కృష్ణమెహన్ రెడ్డి నేడు ప్రారంభించడం జరిగినది. ఎమ్మెల్యే కి మున్సిపల్ చైర్ పర్సన్ కి ఉపాధ్యాయులు, క్రీడాకారులు శాలువా కప్పి పుష్పగుచ్ఛం ఇచ్చి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యతో పాటు క్రీడా రంగాల్లో కూడా నైపుణ్యత కలిగి ఉండాలి అని అన్నారు.

ఉపాధ్యాయులు పాఠశాలలో తరగతి గదిలలో విద్యార్థులకు విద్యను బోధించుతోపాటు అప్పుడప్పుడు మానసిక ఉల్లాసం కోసం ఉపాధ్యాయులు కూడా క్రీడలను అని అన్నారు. ప్రస్తుతం సమాజంలో మారుతున్న ప్రపంచంలో పెరుగుతున్న కార్పొరేటర్ పాఠశాలలతో దీటుగా ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులు విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహించి మానసిక ఒత్తిడికి ఇబ్బంది ఎదుర్కొంటూ ఉంటారు అలాంటి సందర్భంలో ప్రతి ఒక్క ఉపాధ్యాయుని కూడా కాసేపు సరదాగా క్రీడలలో నైపుణ్యం పొంది ఉండాలి . అదేవిధంగా క్రీడల వల్ల మానసికృత్వం శారీరకంగా అని పేర్కొన్నారు.

క్రీడలు ప్రతి ఒక ఉపాధ్యాయుడు చదువుతోపాటు క్రీడారంగంలో కూడా నైపుణ్యత కలిగి ఉండాలి. క్రీడల వల్ల మనకు శారీరకంగా మానసికంగా దృఢత్వం లభిస్తుంది. రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా గద్వాల జిల్లా లోని ఉపాధ్యాయులు క్రికెట్ టోర్నమెంట్ ఏర్పాటు చేయడం జరిగింది గద్వాల నుంచి ఉపాధ్యాయులు మొట్టమొదటిసారిగా క్రికెట్ టోర్నమెంట్ ను ఏర్పాటు చేయడం జరిగింది దీనిని స్ఫూర్తిగా తీసుకొని రాష్ట్రంలో అన్ని జిల్లాలలో కూడా ఉపాధ్యాయులు కూడా క్రీడారంగంలో నైపుణ్యత పొందాలి అలా ఉండడం వల్ల ఉపాధ్యాయులు ఉన్న ఒత్తిడి కొంచెం తగ్గుతుంది అదేవిధంగా శారీరకంగా మానసికంగా కూడా దృఢత్వం పెరుగుతుంది. అని తెలపారు.

ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు ఇలా క్రీడారంగంలో కలిసి అందరూ కలిసిమెలిసిగా ఆడటం వల్ల వారిలోని ఉన్న మానసిక ఒత్తిడి తగ్గుతుంది. ఉపాధ్యాయుల మధ్య ఐక్యత స్నేహభావం పెరుగుతుంది. ఇదేవిధంగా ప్రతి ఒక్క ఉపాధ్యాయులు నెలకు ఒకసారి క్రీడారంగాలపై ప్రతి ఒక్కరు కలిసి మెలిసి క్రీడలలో ఆడాలి అందువల్ల మానసిక ఒత్తిడి తగ్గుకోవడం వల్ల ప్రశాంతమైన జీవితాన్ని గడపడానికి అవకాశం ఉంటుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ తుమ్మల జయలక్ష్మి నర్సింహులు యాదవ్ మాజీ కౌన్సిలర్ నరహరి శ్రీనివాసులు, వ్యవసాయ మార్కెట్ డైరెక్టర్ ఆంజనేయులు నాయకులు ముత్యాల రవి, నాయకులు కార్యకర్తలు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

దీపావళి జోష్: స్టాక్ మార్కెట్ సరికొత్త రికార్డు

Satyam News

తిరుమలలోని పలు ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు

Satyam News

కోటప్పకొండ తిరునాళ్ళు సందర్భంగా ట్రాఫిక్ నిబంధనలు

Satyam News

ప్రభుత్వ ఖర్చులతో స్వదేశానికి చేరిన గల్ఫ్ కార్మికుని మృతదేహం

Satyam News

9 నుంచి టెన్నిస్ ప్రీమియర్ లీగ్ సీజన్ 7 మొదలు

Satyam News

వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు అరెస్టు

Satyam News

Leave a Comment