26.7 C
Hyderabad
September 20, 2026
ప్రత్యేకంహోమ్

పైలెట్ కోసం వచ్చిన అమెరికా దళాలను తిప్పికొట్టిన ఇరాన్

అమెరికా శతృవుల కుట్రలను తిప్పికొడుతూ ఇరాన్ మరో చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది. కూలిపోయిన తన యుద్ధ విమాన పైలట్‌ను రక్షించే నెపంతో ఇరాన్ గడ్డపైకి చొరబడాలని చూసిన అమెరికా దళాలకు కోలుకోలేని దెబ్బ తగిలింది.

దేశం నడిబొడ్డున శతృవుల కదలికలను గుర్తించిన ఇరాన్ సాయుధ బలగాలు మెరుపు దాడిని నిర్వహించాయి. ఏరోస్పేస్ ఫోర్స్, గ్రౌండ్ ఫోర్స్, పాపులర్ మొబిలైజేషన్, బాసిజ్ మరియు ఫరాజా దళాల సంయుక్త ఆపరేషన్‌లో శతృ విమానాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి.

గతంలో తబాస్ ఆపరేషన్‌లో ఎదురైన అవమానకరమైన ఓటమిని తలపిస్తూ అమెరికా మరోసారి అంతర్జాతీయ వేదికపై తలవంచుకోవాల్సి వచ్చింది. ఈ ఘోర పరాజయాన్ని కప్పిపుచ్చుకోవడానికి డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియా వేదికగా తప్పుడు ప్రచారానికి తెరలేపారు.

ఇరాన్‌లో కూలిపోయిన విమాన పైలట్‌ను రక్షించేందుకు ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించినట్లు ఆయన ట్వీట్ చేశారు. అయితే వాస్తవాలు మాత్రం మరోలా ఉన్నాయి. తబాస్ ఇసుక తిన్నెల్లో అగ్రరాజ్యానికి గుణపాఠం చెప్పిన దైవమే నేటికీ ఇరాన్ రక్షణ కవచంగా ఉన్నాడని, జూదరి ట్రంప్ ఎన్ని కుతంత్రాలు చేసినా ఇరాన్ సార్వభౌమత్వాన్ని దెబ్బతీయడం సాధ్యం కాదని ఈ విజయం నిరూపించింది.

శతృవుల వ్యూహాలను చిన్నాభిన్నం చేస్తూ ఇరాన్ జవాన్లు చూపిన శౌర్య పరాక్రమాలు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి.

Related posts

ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్న చిప్ డ్రీమ్!

Satyam News

మహిళలపై అత్యాచారాలు ఎందుకు పెరిగాయి?

Satyam News

అమెరికా పూర్తిగా ఓడిపోయే వరకూ పోరాటం ఆగదు

Satyam News

ఖర్గే తో భేటీ అయిన రేవంత్ రెడ్డి

Satyam News

స్పీడ్ బోటు ప్రమాదం: 19 మంది భారతీయులు మృతి?

Satyam News

శ్రీవారి భక్తుడితో దురుసుగా ప్రవర్తించిన టాక్సీ డ్రైవర్‌పై చర్యలు

Satyam News

Leave a Comment