ప్రత్యేకంహోమ్

తండ్రి చనిపోయిన రోజు…. కోల్‌కతాలో సూట్‌కేసులతో జగన్‌..??

#YSJagan

ఇరవై ఏడేళ్ల తర్వాత వైఎస్సార్ మరణం మరోసారి ఏపీ రాజకీయాలను కుదిపేస్తోంది. వైఎస్ మరణం వెనుక జగన్‌మోహన్‌రెడ్డి పాత్రపై అనుమానాలు ఉన్నాయని గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్‌ ఛీఫ్‌గా ఉన్న సమయంలో బొత్స సత్యనారాయణ తీవ్ర ఆరోపణలు చేశారు. ఇప్పుడు టీడీపీ నేత, మంత్రి అచ్చెన్నాయుడు గతంలో బొత్స చేసిన కామెంట్స్‌ని గుర్తు చేశారు. ఆ రోజు నమ్మలేదుగానీ.. ఇప్పుడు ఆ అనుమానాలు నిజమే అయి ఉండొచ్చని అచ్చెన్నాడు అన్నారు. వైఎస్సార్‌ హెలికాప్టర్‌ మిస్ అయిన రోజు జగన్‌ అసలు ఏపీలోనే లేరని అచ్చెన్నాయుడు అంటున్నారు. ఆ రోజు జగన్‌ కోల్‌కతాలో ఉన్నారని చెప్పారు.

అప్పట్లో జగన్‌పై తీవ్ర ఆరోపణలు చేసిన బొత్స సత్యనారాయణ వాదన మరోలా ఉంది. వైఎస్సార్ మరణించిన రోజు జగన్‌ హైదరాబాద్‌లోనే ఉన్నారని.. తాను, తన భార్య కలిసి జగన్‌ను తీసుకొచ్చామని చెప్పారు.  తలపండిన రాజకీయ నాయకులు, సీనియర్ జర్నలిస్టులు.. అనేక ఇంటర్వ్యూల్లో చెప్పిన సమాచారం ప్రకారం.. వైఎస్ రాజశేఖరరెడ్డి.. తన కుమారుడు జగన్‌ తీరుతో విసిగిపోయి.. అతన్ని రాష్ట్రంలో ఉండొద్దని ఆదేశించారట.

ఈ కారణంగానే కడప ఎంపీగా ఉన్నా కూడా జగన్‌ ఎక్కువగా బెంగళూరులోనే ఉండేవారు. ఇప్పుడు విపక్ష నాయకుడైనా.. ఎక్కువగా బెంగళూరులోనే ఉంటున్నారు. అప్పట్లో తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని వేల కోట్ల అక్రమ సంపాదన వెనకేసుకోడానికి డజన్ల కొద్దీ సూట్ కేసు కంపెనీలు స్థాపించారని సీబీఐ, ఈడీ విచారణలో తేలింది. ఈ సూట్‌ కేసు కంపెనీల్లో చాలా వాటి అడ్రస్‌ కోల్‌కతా. ఆ సూట్‌ కేస్ పని మీదే అప్పుడు జగన్‌ కోల్‌కతాలో ఉన్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఆ విధంగా చూస్తే.. వైఎస్సార్ హెలికాప్టర్‌ మిస్‌ అయిన రోజు జగన్‌ కోల్‌కతాలో ఉన్నారంటున్న.. మంత్రి అచ్చెన్నాయుడు వాదన నిజమే అనుకోవాలి.

హెలికాప్టర్‌ ఆచూకీ తెలియకుండా పోయిన తర్వాత రోజు ప్రమాదం జరిగిన విషయం వెలుగులోకి వచ్చింది. అప్పటికే జగన్‌ కోల్‌కతా నుంచి హైదరాబాద్‌ చేరుకొని ఉంటారు. ఆ విధంగా చూస్తే బొత్స వాదన కూడా కరెక్ట్‌ అవుతుంది. ఏది ఏమైనా.. కోల్‌కతాలో ఆ రోజు జగన్‌ ఏం చేస్తున్నారు.. వైఎస్ రాజశేఖరరెడ్డి మరణం ప్రమాదమా లేక దీని వెనుక కుట్రలు, విద్రోహ చర్యలు ఉన్నాయా అనేది ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయింది. ఇక్కడ అసలైన విషాదం‌ ఏంటంటే.. వైఎస్ రాజశేఖరరెడ్డి మరణం ప్రమాదం కాదనే వాదన మొదట ప్రారంభించిన జగనే. ఇప్పుడు ఆ ఆరోపణలు ఆయన మీదకే మళ్లడం విధి విలాసం అనుకోవాలేమో. కర్మ ఎవరినీ వదలదు అని చెప్పడానికి ఇదొక ప్రత్యక్ష ఉదాహరణ.

Related posts

అమెరికాలో హోరెత్తిన ట్రంప్ వ్యతిరేక నిరసనలు

Satyam News

ధర్మేంద్ర కేవలం భర్త మాత్రమే కాదు….

Satyam News

భార్య ఎక్కువ తింటున్నదని హత్య చేసిన భర్త

Satyam News

భారత్ రక్షణ రంగంలో మరో కీలక అడుగు

Satyam News

ఇరాన్ పై బీ 2 స్టిల్త్ బాంబర్ల ప్రయోగం

Satyam News

మరింత తగ్గనున్న వైసీపీ సీట్లు, ఓట్లు….!!

Satyam News

Leave a Comment