ప్రత్యేకంహోమ్

క్వాంటం డీప్ టెక్ లో అజేయ శక్తిగా అమరావతి

#CBNProfile

నవశకం సాంకేతికత క్వాంటం టెక్నాలజీలో గ్లోబల్ లీడర్ గా అమరావతి ఎదుగుతోంది. నేషనల్ క్వాంటం మిషన్ లక్ష్యాలను అందిపుచ్చుకుని దేశంలోనే తొలి క్వాంటం కంప్యూటింగ్ కేంద్రంగా రూపు దిద్దుకుంటోంది. క్వాంటం టెక్నాలజీలో పరిశోధనలు, ఆవిష్కరణల దిశగా అవసరమైన ఎకోసిస్టం సిద్ధమవుతోంది.

మూడు దశాబ్దాల క్రితం ఐటీ విప్లవానికి నాంది పలికిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఇప్పుడు క్వాంటం టెక్నాలజీ తో ఆంధ్రప్రదేశ్‌ను భవిష్యత్ ప్రపంచానికి చిరునామాగా మారుస్తున్నారు. ఏప్రిల్ 14, ప్రపంచ క్వాంటం దినోత్సవాన్ని పురస్కరించుకుని ముఖ్యమంత్రి అమరావతిలో దేశంలోనే మొట్టమొదటి స్వదేశీ క్వాంటం కంప్యూటర్ల టెస్టింగ్ రిఫరెన్సు ఫెసిలిటీని సీఎం ప్రారంభించనున్నారు.

గన్నవరంలోని మేధాటవర్స్ తో పాటు రాజధానిలోని ఎస్ఆర్ఎం యూనివర్సిటీ లో 1ఎస్, 1 క్యూ పేరిట రెండు వేర్వేరు క్వాంటం టెస్టింగ్ రిఫరెన్సు ఫెసిలిటీలు ప్రారంభం కానున్నాయి. దీంతో దేశంలోనే క్వాంటం టెస్ట్ రిఫరెన్సు ఫెసిలిటీ కలిగిన తొలి రాష్ట్రంగా ఏపీ అవతరించనుంది.

ఈ స్వదేశీ నిర్మిత క్వాంటం రిఫరెన్స్ టెస్ట్ ఫెసిలిటీలు అమరావతిని ఓ అత్యాధునిక క్వాంటం ఎకోసిస్టమ్ గా తీర్చిదిద్దనున్నాయి.  పూర్తి స్వదేశీ టెక్నాలజీతో భారత్ లోనే తొలిసారి క్వాంటం కంప్యూటర్ హార్డ్ వేర్ ను పరీక్షించే సౌకర్యాన్ని అమరావతిలో ఏర్పాటు చేశారు. అమరావతి 1Q పేరిట మినీ క్వాంటం కంప్యూటింగ్ టెస్టింగ్ ఫెసిలిటీని  గన్నవరంలోని మేధా టవర్స్‌లో ఏర్పాటు చేశారు.

అమరావతి 1S పేరిట రాజధానిలోని ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో విద్యార్థులు, పరిశోధకుల కోసం ఇది ‘ఓపెన్ యాక్సెస్’ ప్రాతిపదికన మరో క్వాంటం రిఫరెన్సు టెస్ట్ ఫెసిలిటీని తీర్చిదిద్దారు.  క్వాంటం కంప్యూటింగ్ ప్రక్రియను ప్రత్యక్షంగా వీక్షించేలా ఓపెన్ యాక్సెస్ రిఫరెన్సు ఫెసిలిటీగా దీనిని ఏర్పాటు చేశారు.

క్వాంటం హార్డ్‌వేర్ తయారీలో కీలకం

మేధాటవర్స్  సహా ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో ఏర్పాటు చేస్తున్న ఈ క్వాంటం రిఫరెన్సు ఫెసిలిటీ టెస్ట్ బెడ్ లు క్వాంటం హార్డ్ వేర్ తయారీలో కీలకం కానున్నాయి. ఈ రెండు చోట్లా మైనస్ 273 సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రతలో క్వాంటం కంప్యూటర్లు పనిచేయనున్నాయి.

క్వాంటం కంప్యూటర్లలో ఉపకరించే వివిధ పరికరాలను టెస్ట్ చేసేలా ఈ రిఫరెన్సు ఫెసిలిటీలు తోడ్పాటు అందించనున్నాయి. క్వాంటం టెక్నాలజీలో కేవలం సాఫ్ట్‌వేర్ అల్గారిథమ్స్ తో పాటు హార్డ్‌వేర్ తయారీలోనూ స్వయం సమృద్ధి సాధించాలన్నది ముఖ్యమంత్రి చంద్రబాబు  ఆశయం.

ఇందులో భాగంగా క్వాంటం కంప్యూటర్లకు అవసరమైన పరికరాలను తయారు చేయాలని కూడా లక్ష్యంగా నిర్దేశించారు. ఇటీవలే 30కి పైగా క్వాంటం హార్డ్ వేర్ తయారీ సంస్థలతో ముఖ్యమంత్రి సమావేశం కూడా నిర్వహించారు.

అమరావతిలో ఏర్పాటు అవుతున్న క్వాంటం రిఫరెన్స్ ఫెసిలిటీ భారత్ లో క్వాంటం హార్డ్‌వేర్ నెట్‌వర్క్‌కు యాంకర్ నోడ్ గా తీర్చిదిద్దాలని లక్ష్యంగా నిర్దేశించారు.

క్వాంటం తయారీ రంగంలో క్రయోజెనిక్స్ లాంటి సాంకేతికతలను ఉపయోగించి ప్రెసిషన్ ఎలక్ట్రానిక్స్, క్వాంటం గ్రేడ్ ఫ్యాబ్రికేషన్ లాంటి రంగాల్లో స్వదేశీ క్వాంటం కంప్యూటింగ్ ఉపకరణాల తయారీకి కేంద్రంగా అమరావతి మారాలన్నది ఈ ఆలోచన ముఖ్య ఉద్దేశం. ఇక్కడ పరీక్షించిన క్వాంటం కంప్యూటింగ్ పరికరాలకు సర్టిఫికేషన్ ఇచ్చేలా ఈ టెస్ట్ ఫెసిలిటీలను సిద్ధం చేశారు.

ఆధునిక గ్లోబల్ టెక్ హబ్ గా ఏపీ

అమరావతిని ప్రపంచంలోని మొదటి 5 క్వాంటం హబ్‌లలో ఒకటిగా తీర్చిదిద్దేలా రాష్ట్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా క్వాంటం వ్యాలీని ఏర్పాటు చేస్తోంది. దీని కోసం రాష్ట్ర ప్రభుత్వం క్వాంటం కంప్యూటింగ్ పాలసీ 2025-30ని కూడా విడుదల చేసింది.

గత ఏడాది జూన్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు క్వాంటం డిక్లరేషన్ ను కూడా ప్రకటించారు. అమరావతిలోని ఉద్దండరాయుని పాలెం వద్ద 50 ఎకరాల్లో ఏక్యూఏసీ కేంద్రం నిర్మితం అవుతోంది. ఆరు టవర్లుగా నిర్మిస్తున్న ఈ భవనాల్లో  అంతర్జాతీయ టెక్ దిగ్గజం ఐబీఎం భాగస్వామ్యంతో అత్యంత శక్తివంతమైన 133 క్యూబిట్, 5 కే గేట్ క్వాంటం కంప్యూటర్ ఏర్పాటు కానుంది.

ఐబీఎంతో పాటు టీసీఎస్, ఎల్ అండ్ టీ లాంటి ప్రతిష్టాత్మక సంస్థలు అమరావతి క్వాంటం కంప్యూటింగ్ కేంద్రం ఏర్పాటులో కీలక పాత్ర పోషిస్తున్నాయి. టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్, కేంద్ర ప్రభుత్వంలోని సీఐఎస్ఆర్ నేతృత్వంలోని నేషనల్ టెస్టింగ్ ల్యాబ్ లాంటి సంస్థలు కూడా దీనికి సహకారాన్ని అందిస్తున్నాయి.

నూతన ఔషధాల ఆవిష్కరణ, సంక్లిష్ట వ్యాధులకు వ్యాక్సీన్ల ఉత్పత్తిలో వేగం, వెదర్ మోడలింగ్, సెమీ కండక్టర్లు పాలన, లాజిస్టిక్స్ రంగాల్లో డేటా అనలటిక్స్, రక్షణ, ఏరోస్పేస్ రంగాల్లో కీలకమైన పరిశోధనలు చేసేలా దేశంలోనే తొలి క్వాంటం కంప్యూటర్ అమరావతిలో త్వరలోనే ఆవిష్కృతం కానుంది.

అమరావతి క్వాంటం కంప్యూటింగ్ కేంద్రం నుంచి పరిశోధనలు, ఆవిష్కరణల కోసం ఇప్పటికే 80కి పైగా అంతర్జాతీయ స్థాయి  కంపెనీలు, విద్యా సంస్థలు ఒప్పందం చేసుకున్నాయి. క్వాంటం కంప్యూటింగ్ అల్గారిథమ్స్ లో నిపుణులైన మానవ వనరులను సిద్ధం చేసేందుకు ఐఐటీ చెన్నై, వైసర్ లాంటి సంస్థలతో ప్రభుత్వం భాగస్వామ్యం కూడా కుదుర్చుకుంది.

క్వాంటంలో నైపుణ్యాల కోసం ఇప్పటికే 60 వేల మంది శిక్షణ పొందుతున్నారు. వచ్చే ఐదేళ్లలో 45 లక్షల మందిని క్వాంటం నిపుణులుగా తీర్చిదిద్దేలా ప్రభుత్వం కార్యాచరణ చేపట్టింది.

Related posts

యూట్యూబర్ నాన్సీ హత్యకు అసలు కారణం ఏమిటి?

Satyam News

కార్యకర్తలకు గుర్తింపునిచ్చే పార్టీ  టీడీపీ

Satyam News

ప్రముఖ ఫిల్మ్ జర్నలిస్ట్ ధీరజ అప్పాజీ “అమ్ములు”కు అనూహ్య స్పందన

Satyam News

“ఆపరేషన్ వజ్రప్రహార్” లో 13 బైక్స్ సీజ్‌

Satyam News

పశ్చిమ బెంగాల్ సీఎంగా సువేందు ప్రమాణం

Satyam News

బా.సి.రెడ్డి జీవితం నేటి తరానికి స్ఫూర్తిదాయకం

Satyam News

Leave a Comment