విజయనగరంహోమ్

ఆంగ్ల‌ సంవత్సర వేడుకలకు విజ‌య‌న‌గ‌రం జిల్లా ఎస్పీ ఆంక్ష‌లు

#ARDamodarIPS

కొత్త‌ సంవత్సర వేడుకలను జిల్లా ప్ర‌జ‌లు శాంతియుతంగా నిర్వహించుకోవాలని, వేడుకల పేరుతో ఎవరైనా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని విజ‌య‌న‌గ‌రం జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ సోమ‌వారం హెచ్చరించారు. జిల్లా ప్రజలందరూ ప్రశాంత వాతావరణంలో నూతన సంవత్సర వేడుకలను కుటుంబ  సభ్యులతో ఇంటి వద్దనే జరుపుకోవాలని ఎస్పీ దామోద‌ర్ సూచించారు.

మద్యం సేవించి వాహనాలు నడిపి డ్రంకన్ డ్రైవ్ కేసులలో ఇరుక్కొని జైలుకు వెళ్లొద్ద‌న్నారు. కుటుంబ సభ్యులతో కలిసి నూతన సంవత్సర వేడుకలు జ‌రుపుకోవాల‌ని, పోలీసుశాఖకు సహకరించాలని జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ కోరారు. నూతన సంవత్సర వేడుకలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకొనేందుకు జిల్లా ఎస్పీ విధించిన ఆంక్ష‌లు ఇవే.

31-12-2025 ది రాత్రి బహిరంగ ప్రదేశాల్లో, రహదారులపై నూతన సంవత్సర వేడుకలను నిర్వహించరాదు

మద్యం సేవించి వాహనాలు నడపరాదు.

డ్రంకన్ డ్రైవ్ కేసులు నమోదు చేసి జైలుకు.

వాహనాలను అతివేగంగా నడిపినా, బైక్ రేసులు నిర్వహించినా, ట్రిపుల్ రైడింగు చేసినా కేసులు నమోదు.

ప్రత్యేక డ్రైవ్ చేపట్టి ఆయా వాహనాలను సీజ్.

అర్ధ రాత్రి ఒంటి గంట తరువాత ప్రజలెవ్వరూ రహదారుల పై తిరగరాదు.

మైనర్లుకు తల్లిదండ్రులు వాహనాలను ఇవ్వొద్దు.

జిల్లా వ్యాప్తంగా ప్రత్యేకంగా డ్రైవ్.

వాహన యజమానులపై కేసులు నమోదు.

ముఖ్య కూడళ్ళలో పోలీసు బందోబస్తు, పికెట్లు.

బహిరంగ ప్రదేశాల్లో కేక్ లు కట్ చేయొద్దు.,

డ్యాన్స్ లు , బహిరంగ పార్టీలు నిర్వహించొద్దు.

రంగులు పూయడం, డిజే,లౌడు స్పీకర్ల్ వాడ‌కం నిషేధం

ప్రజలకు ఇబ్బంది కలిగిస్తే చట్టపరమైన చర్యలు.

వేడుకలో పేరుతో మందుగుండు సామగ్రిని కాలిస్తే చర్యలు.

మహిళలు, యువతులను వేధించడం, ఈవ్ టీజింగుకు పాల్పడినా కఠిన చర్యలు

ప్రభుత్వం నిర్దేశించిన సమయం వరకు మాత్రమే మద్యం విక్రయాలు.

నిబంధనలు ఉల్లంఘిస్తే ఆయా మద్యం షాపులు, బార్లపైన కూడా చర్యలు.

రాత్రి పెట్రోలింగ్‌, డ్రోన్ పెట్రోలింగ్‌,  గస్తీని ముమ్మరం

Related posts

ఆలూరు వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్టు

Satyam News

పాగుంట వెంకన్న స్వామి ఆలయానికి పోటెత్తిన‌ భక్తజనం

Satyam News

‘ఆత్మరక్షణ’ పేరుతో మళ్లీ అమెరికా దాడులు

Satyam News

విజయవాడ లో ఉగ్రవాదుల అరెస్టు

Satyam News

గాయకుడు గా మారిన దర్శకుడు పీసీ ఆదిత్య

Satyam News

తిరుమలలో ఘనంగా పార్వేటు ఉత్సవం

Satyam News

Leave a Comment