26.3 C
Hyderabad
September 19, 2026
కృష్ణహోమ్

చంద్రబాబుతో గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డ్ చైర్మన్ భేటీ

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డ్ చైర్మన్ పి దోర్జే గ్యాంబా సీఎం క్యాంపు కార్యాలయంలో ఆదివారం మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో చేపట్టిన జల సంరక్షణ, సమర్ధ నీటి నిర్వహణ చర్యలు గురించి దోర్జే గ్యాంబాకు ముఖ్యమంత్రి వివరించారు.

రాష్ట్రంలోని నదీపరివాహక ప్రాంతాల్లో అవేర్ సంస్థ ద్వారా జల వనరుల వివరాలు రియల్ టైమ్‌లో నమోదు చేస్తున్నట్టు తెలిపారు. వరద జలాలను సద్వినియోగం చేసుకుంటున్న తీరును, నదుల అనుసంధానంపై రూపొందించిన ప్రణాళికల గురించి వెల్లడించారు. అలాగే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల సరిహద్దు.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పెద్దవాగు ప్రాజెక్టు సమస్యపై చర్చించారు.

గత సీజన్లో పెద్దవాగు పొంగి కట్ట తెగడంతో రెండు రాష్ట్రాల్లోనూ వరదలు సంభవించాయని, ఈ కారణంగా ప్రజలు ఇబ్బంది పడిన విషయం ఈ సమావేశంలో చర్చకు వచ్చింది. పెద్దవాగు ప్రాజెక్టు కట్టను బలోపేతం చేయడానికి తెలంగాణ రాష్ట్రంతో కలిసి పనిచేయడానికి తాము సిద్ధంగా ఉన్నట్టు దోర్జే గ్యాంబాకు సీఎం తెలిపారు.

Related posts

Lokesh Magic: కార్పొరేట్‌ను తలదన్నే ప్రభుత్వ స్కూల్స్!

Satyam News

దళపతి విజయ్ కు కాంగ్రెస్ మద్దతు

Satyam News

ఏపీ లో ఇలా జరుగుతున్నది ఏమిటి?

Satyam News

యూట్యూబర్ పై దుండగుల కాల్పులు

Satyam News

కాకినాడ ప్రాంతంలో ముమ్మరంగా సహాయక చర్యలు

Satyam News

బాగ్ లింగంపల్లి మైనార్టీ గురుకుల ఘటనపై హరీష్ రావు విమర్శలు

Satyam News

Leave a Comment