25.2 C
Hyderabad
September 20, 2026
తూర్పుగోదావరిహోమ్

ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఫిర్యాదుల స్వీకరణ

కాకినాడ జిల్లా పోలీసు కార్యాలయంలో నేడు నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) కార్యక్రమంలో జిల్లా ఎస్పీ జి.బిందు మాధవ్ మొత్తం 35 ఫిర్యాదులను స్వీకరించారు. వాటిలో భూ తగాదాలు –09, కుటుంబ కలహాలు –11 మరియు ఇతర విభాగాలకు చెందినవి–15 గా గుర్తించబడ్డాయి.

ఈ సందర్భంగా ఎస్పీ జి. బిందు మాధవ్ సంబంధిత అధికారులను ఆదేశిస్తూ, “ప్రతి ఫిర్యాదును నిశితంగా పరిశీలించి వాస్తవాలు నిర్ధారించగానే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, 7 రోజుల లోపు విచారణ పూర్తిచేసి తగిన పరిష్కారం చూపాలని, వివరాలను జిల్లా పోలీసు కార్యాలయానికి సమర్పించాలని సూచించారు.

ఫిర్యాదుదారులతో స్వయంగా మాట్లాడి వారి సమస్యలను విన్న ఎస్పీ ప్రజలకు త్వరితగతిన న్యాయం అందించడమే పోలీసుల ప్రధాన కర్తవ్యమని, ప్రజా సమస్యలను న్యాయపరంగా పరిష్కరించడంలో కాకినాడ జిల్లా పోలీసులు పూర్తి నిబద్ధతతో పని చేస్తున్నారని తెలిపారు.

Related posts

కలలకు సహకరించిన కుంచె

Satyam News

అర్థరాత్రి ఖాకీలు కుయ్యి… కుయ్యిమంటూ అలెర్ట్

Satyam News

స్థానిక ఎన్నికలలో జనసేన అన్ని స్థానాలలో పోటీకి సిద్ధం

Satyam News

చిన జీయర్ కు శ్రీగురూజీ సవాల్

Satyam News

త్వరలో రష్యా లో పర్యటించనున్న ప్రధాని మోడీ

Satyam News

శ్రీవారిని దర్శించుకున్న భారత రాష్ట్రపతి

Satyam News

Leave a Comment