ఆధ్యాత్మికంహోమ్

చిన జీయర్ కు శ్రీగురూజీ సవాల్

సనాతన ధర్మం గురించి పలువురు పలు రకాలుగా వ్యాఖ్యలు చేయడాన్ని శ్రీ స్వామి రామానంద యోగజ్జాన పీఠాధిపతి అంతర్ముఖానంద శ్రీగురూజీ తీవ్రంగా ఖండించారు. ఏపీలోని విజయనగరం జిల్లా బాడంగి మండలం కామన్నవలస ఆశ్రమంలో జగద్గురు ఆది శంకరాచార్యుల జయంతి మంగళవారం జరిగింది.

ఈ సందర్బంగా ఆశ్రమంలో శ్రీగురూజీ ప్రవచనలు చేస్తూ ఇటీవల చిన జీయర్ ధర్మం గురించి చేసిన వ్యాఖ్యలు, అలాగే సినీ నటుడు ప్రకాష్ రాజే రామ, లక్ష్మణులపై వాగిన దాన్ని తీవ్రంగా ఖండించారు. ఆది శంకరుల జయంతి సందర్బంగా ఆశ్రమం లో తెల్లవారుజామున అఖండ జపం, పొద్దున్న సద్గురు పూజ ఆదిశంకరుల సహస్రం పఠించారు. అటు శ్రీ స్వామిజీ సమాధి మందిరంలో ఇటు ఆశ్రమం పీఠంలో పూజ జరిగింది.

అనంతరం అల్పాహారం అయినా తరువాత శ్రీ గురూజీ దాదాపు రెండున్నర గంటల పాటు బౌద్ధిక్ ఇచ్చారు. ఈ కార్యక్రమం లో శివ, రమేష్, శంకరరావు, చక్రవర్తి, విజయ్ గోపాల్, లక్ష్మణరావు,మనోహర్,డాక్టర్ సుబ్రహ్మణ్యం, డాక్టర్ హరగోపాల్ తో పాటు విజయవాడ, ఒంగోలు హైదరాబాద్ ల నుండీ శిష్యులు పాల్గొన్నారు.

Related posts

జగన్‌ మరో మూడు ముక్కలాట..??

Satyam News

వాయుగుండం నేపథ్యంలో అధికారులు అప్రమత్తం

Satyam News

దత్తాత్రేయ స్వామి వారికి విశేష పూజలు

Satyam News

ప్లాట్ ఫామ్ ఫీజును మళ్లీ పెంచిన స్విగ్గీ

Satyam News

సాకారమవుతున్న అమరావతి స్వప్నం

Satyam News

‘కందుకూరు హత్య’ ను కుల కోణంలో చూపిస్తూ వైసీపీ ఫేక్ ప్రచారం

Satyam News

Leave a Comment