26.3 C
Hyderabad
September 19, 2026
శ్రీకాకుళంహోమ్

మత్స్యకార గ్రామంలో నిదురించనున్న కేంద్ర మంత్రి

కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు కోల్ ఇండియా సంస్థ సి.ఎస్.ఆర్ నిధులతో చేపట్టిన ప్రతిష్టాత్మక కార్యక్రమం మత్స్యసాగర మాల ను రేపు ఇచ్చాపురం నియోజకవర్గం సోంపేట మండలం ఎర్రముక్కాం గ్రామంలో ప్రారంభించనున్నారు.

మొత్తంగా జిల్లాలో ఇప్పటికే 1594 లైట్లను ఏర్పాటు చెయ్యగా.. రెండవ విడత కూడా ప్రస్తుతం లైట్ల అమరిక ప్రక్రియ జరుగుతోంది. మొదటి విడత దిగ్విజయంగా పూర్తైన నేపధ్యంలో శుక్రవారం నాడు రామ్మోహన్ నాయుడు.. ఈ కార్యక్రమాన్ని స్థానిక ఎమ్మెల్యే బెందాళం అశోక్ తో కలసి ప్రారంభించనున్నారు.

అనంతరం స్థానిక మత్స్యకార గ్రామాల్లో పర్యటించనున్న కేంద్ర మంత్రి.. ఈ రెండేళ్ళ కాలంలో కూటమి సర్కారు చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను స్థానికులకు వివరించనున్నారు. అనంతరం ఎకువూరు, నడుమూరు గ్రామాల్లో పలు కార్యక్రమాల్లో పాల్గొని.. నడుమూరు గ్రామంలో పల్లె నిద్ర కార్యక్రమం లో భాగంగా అక్కడే నిదురించనున్నారు.

కేంద్ర మంత్రి చేపట్టనున్న ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమం కోసం ఇప్పటికే శరవేగంగా ఏర్పాట్లను అధికార యంత్రాంగం పూర్తి చేశారు.

Related posts

No Sleep: నిద్ర పై ఎల్ ని నో తీవ్ర ప్రభావం

Satyam News

గాల్లోనే పేలిపోయిన ఎయిర్ అంబులెన్స్

Satyam News

“తల తిరుగుడు” కు అత్యాధునిక వైద్య చికిత్సలు

Satyam News

కోల్డ్రిఫ్ దగ్గు మందు ప్రమాదకరం… వాడద్దు

Satyam News

ఆత్మప్రబోధం ప్రకారం ఓటు వేయండి

Satyam News

ఈవీ బస్సు ‘పల్లె వెలుగు’ అయినా ఏసీనే

Satyam News

Leave a Comment