26.3 C
Hyderabad
September 19, 2026
ప్రత్యేకంహోమ్

కువైట్‌లో చిక్కుకున్న చంద్రగిరి మహిళకు అండగా రాష్ట్ర ప్రభుత్వం

#Chandra

తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం తొండవాడ గ్రామానికి చెందిన భాగ్యవతి కువైట్‌లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనే మీడియా కథనాలపై ముఖ్యమంత్రి కార్యాలయం తక్షణం స్పందించింది. బాధిత మహిళను సురక్షితంగా భారత్‌కు తీసుకురావడానికి అత్యవసర చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు.

ఉపాధి కోసం ఈ ఏడాది ఫిబ్రవరిలో కువైట్‌కు వెళ్లిన భాగ్యవతి అక్కడ గృహ సహాయకురాలిగా పనిచేస్తుండగా, ఉద్యోగ వీసా కల్పించకుండా ఏజెంట్లు నిర్లక్ష్యం చేసినట్టు తెలిసింది. అంతేకాకుండా తనను శారీరకంగా, మానసికంగా వేధింపులకు గురి చేస్తున్నట్టు కుటుంబ సభ్యులకు, సోషల్ మీడియా ద్వారా బాధితురాలు సెల్ఫీ వీడియో ద్వారా తెలియజేశారు.

స్వదేశానికి తిరిగి పంపించాలని కోరితే డబ్బులు చెల్లించాలని ఒత్తిడి తెస్తున్నారని ఆమె ఆ వీడియోలో ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాలతో ఏపీ ఎన్‌ఆర్టీ వెంటనే స్పందించి, కువైట్‌లోని భారత రాయబార కార్యాలయంతో సంప్రదింపులు జరిపింది. బాధితురాలి భద్రతకు ప్రాధాన్యం ఇస్తూ, ఆమెను తక్షణం స్వదేశానికి రప్పించే దిశగా ప్రయత్నిస్తోంది.

అదేవిధంగా సంబంధిత ఏజెంట్ల పాత్రపై విచారణ చేపట్టాలని, అవసరమైతే న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు సీఎం సూచించారు. తిరుపతి జిల్లా యంత్రాంగం, చంద్రగిరి పోలీస్ స్టేషన్ అధికారులు కూడా భాగ్యవతి కుటుంబ సభ్యులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ భరోసా ఇచ్చారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తి అండగా ఉంటుందని, భాగ్యవతి సురక్షితంగా స్వదేశానికి తిరిగి వచ్చే వరకు అన్ని విధాల సహకారం అందిస్తామని ఆమె కుటుంబ సభ్యులకు అధికారులు తెలిపారు.

Related posts

స్వర్ణ నారావారి పల్లె తరహాలో స్వర్ణ చంద్రగిరి కి ప్రణాళిక

Satyam News

గద్వాల జిల్లా కోర్టు సముదాయం పీజేపీ క్యాంపు లోనే నిర్మించాలి

Satyam News

వైసీపీని వీడి తెలుగుదేశంలో చేరుతున్న నేతలు

Satyam News

ట్రంప్ హెచ్చరికలతో వణుకుతున్న ఇరాన్

Satyam News

13 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడి ఆవిరి

Satyam News

రాయలసీమను తాకిన నైరుతి రుతుపవనాలు

Satyam News

Leave a Comment