ఆధ్యాత్మికం హోమ్

బీచుపల్లిలో రేపు శ్రీ సీతారాముల కళ్యాణం

#Bichupalli

శ్రీ బీచుపల్లి పుణ్య క్షేత్రంలో  కృష్ణా నది సమీపాన వెలసిన శ్రీ కోదండరామ స్వామి దేవస్థానంలో 17న (బుధవారం) పునర్వసు నక్షత్రం రోజున శ్రీ సీతా రాములవారి కళ్యాణం వైభవంగా నిర్వహించనున్నారు. జోగులాంబ గద్వాల జిల్లా, ఎర్రవల్లి మండలం,శ్రీ బీచుపల్లి పుణ్యక్షేత్రంలో కృష్ణా నది సమీపాన వెలసిన శ్రీ కోదండరామ స్వామి దేవస్థానం లో జరిగే శ్రీ సీతారాముల కళ్యాణమునకు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కల్యాణ మహోత్సవాన్ని కనులారా వీక్షించి ఆనందించ గలరని కోరుతున్నాము. కళ్యాణం  తదనంతరం దేవాలయమునకు విచ్చేసిన  భక్తులకు మరియు కళ్యాణమునకు విచ్చేసిన భక్తులందరికీ అన్నప్రసాద వితరణ కార్యక్రమం పాలకమండలి వారు నిర్వహిస్తున్నట్లు ఆలయ మేనేజర్ సురేంద్ర రాజు తెలియజేశారు.

Related posts

విజయవాడ దుర్గగుడి ఆలయ కమిటీ కొత్త సభ్యుల నియామకం

Satyam News

వార్ రూమ్ నుంచి మరువలేని సాయం

Satyam News

పాక్ తో క్రికెట్ మ్యాచ్ బాయ్ కాట్

Satyam News

Leave a Comment

error: Content is protected !!