ప్రకాశంహోమ్

మంత్రి లోకేష్ సమర్థతకు దక్కిన గుర్తింపు

#GottipatiRavi

పార్టీ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు ధైర్యంగా ముందడుగు వేసిన నాయకుడు నారా లోకేష్ అని, ఓ ప్రాంతీయ పార్టీని గొప్పగా నడుపుతూ లోకేష్ అన్ని విధాలా తెలుగుదేశంను ముందుకు నడిపిస్తున్నారని విద్యుత్ శాఖ మంత్రి, పల్నాడు జిల్లా ఇన్చార్జి మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు.

తెలుగుదేశం పార్టీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించడంపై హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ కు అభినందనలు తెలిపారు. జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షునిగా మంత్రి నారాలోకేష్ నియామకం సమర్థవంతమైన నాయకత్వానికి దక్కిన గుర్తింపుగా అభివందించారు.

యువగళం పాదయాత్రలో అప్పటి వైసీపీ ఎన్ని ఇబ్బందులు పెట్టినా రాష్ట్రం బాగు కోసం నారా లోకేష్ ఎక్కడా వెనుకడుగు వేయలేదని పేర్కొన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒంగోలు మహానాడు నిర్వహణ సహా, పార్టీ కార్యక్రమాలు విజయవంతం అయ్యేలా చూడటం లోకేష్ కోఆర్డినేషన్ వల్లే సాధ్యమైందని తెలిపారు.

కార్యకర్తల సంక్షేమ నిధితో పాటు ఎన్నో కీలక సంస్కరణలకు లోకేష్ శ్రీకారం చుట్టారన్నారు. ఇన్సూరెన్స్ పాలసీ కార్యకర్తలకు అందుబాటులోకి తీసుకురావడంతో పాటు కోటి మంది సభ్యులతో పార్టీని బలోపేతం చేయటం ఆ క్రెడిట్ లోకేష్ దక్కుతుందని చెప్పారు.

కష్టపడే వారికి తగిన గుర్తింపు ఇస్తూ అహర్నిశలు ప్రజల బాగు కోసం పరితపిస్తున్నారు. లోకేష్ మంత్రి గానూ నిరుద్యోగ సమస్య పరిష్కారానికి పెట్టుబడులు స్థాపనకు ఎంతో కృషి చేస్తున్నారని అన్నారు.

Related posts

ది లీడర్…. హిందూపురంలో బాలయ్య మార్క్‌.!

Satyam News

తన పర్సనల్ అసిస్టెంట్ ఇంట్లో ఆతిథ్యం స్వీకరించిన వినోద్ కుమార్

Satyam News

కొడుకు, కోడలి ఖాతాల్లోకి లిక్కర్ సొమ్ము..అడ్డంగా దొరికిన కారుమూరి.!

Satyam News

పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (PoK) లో కాల్పులు

Satyam News

లోకేశ్‌ రెడ్‌ బుక్‌…. పవన్‌ యోగీ ట్రీట్‌మెంట్‌…. వైసీపీకి మూడింది..!

Satyam News

జిందగీ నా మిలేగీ దుబారా 2 త్వరలో…..

Satyam News

Leave a Comment