హైదరాబాద్హోమ్

లోడర్ ఎక్సవేటర్ యంత్రాలతో రైతులకు మేలు

#TummalaNageswararao

ఎక్స్ కా (XCA) కంపెనీ ప్రవేశపెట్టిన లోడర్, ఎక్సవేటర్ యంత్రాలతో రైతులకు మేలు జరుగుతుందని, కూలీల కొరతను రైతులు అధిగమించవచ్చని, త్వరగా పొలం పనులు పూర్తి చేసుకోవచ్చని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. కంప్యూటర్ సైన్స్‌లో మాస్టర్స్ డిగ్రీలు పొందిన ఎక్స్ కా (XCA) సంస్థ ప్రతినిధులు కృష్ణ కొల్లూరి, సిద్ధార్థ పోలిశెట్టి, కౌండిన్య అచ్యుతునిలు రైతుల కోసం ఇలాంటి యంత్రాలను మార్కెట్‌లోకి తీసుకురావడం అభినందనీయమని మంత్రి వారిని అభినందించారు.

రైతులకు పొలంలో సులభంగా ఉపయోగపడే పోర్టబుల్ యంత్రాలను వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాదాపూర్ హైటెక్స్ ఎగ్జిబిషన్‌లో ‘ఎర్త్‌కాన్ ఎక్స్‌ఫో 2026’ శుక్రవారం ప్రారంభించారు. మంత్రి ఈ సందర్భంగా యంత్రాల పనితీరును స్వయంగా పరిశీలించి నిర్వాహకులను అభినందించారు.

ప్రస్తుత పరిస్థితులలో ఇలాంటి వినూత్న యంత్రాల అవసరం మార్కెట్లో ఎంతైనా ఉందని మంత్రి పేర్కొన్నారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ ఈ యంత్రాలతో రైతులకు మేలు జరుగుతుందని, వారు పొలాల్లో సులభంగా పనులు చేసుకోవచ్చని, పోలాల్లో ఈ యంత్రాలతో ఈజీగా పనులు పూర్తి అవుతాయని మంత్రి తుమ్మల పేర్కొన్నారు.

ఎక్స్ కా (XCA) కంపెనీ ప్రవేశపెట్టిన లోడర్, ఎక్సవేటర్ యంత్రాలను రైతులకు అతి తక్కువ ధరకు అందించడానికి ఎక్స్ కా ముందుకు రావడం అభినందనీయమని మంత్రి తుమ్మల ఎక్స్ కా (XCA) సంస్థ ప్రతినిధులు కృష్ణ కొల్లూరి, సిద్ధార్థ పోలిశెట్టి, కౌండిన్య అచ్యుతుని మంత్రి తుమ్మల ప్రశంసించారు. ఈ కంపెనీ ప్రవేశపెట్టిన లోడర్ యంత్రంతో పొలంలో సామాన్లు ఎత్తడం, దించడం లాంటి చేయవచ్చని, మరో యంత్రం ఎక్సవేటర్‌తో రాళ్లను పగులగొట్టడం, కలుపు మొక్కలను తొలగించడం, గుంతలు తీయడం లాంటి పనులను అతి త్వరగా పూర్తి చేయవచ్చని మంత్రి పేర్కొన్నారు.

ఫాం మెకనైజేషన్ స్కీంలో చేర్చితే రైతులకు 40 శాతం సబ్సిడీ

పొలాల్లో ఈ యంత్రాలు సులభంగా తిరుగుతాయని మంత్రి తెలిపారు. ఈ యంత్రాలను వ్యవసాయ శాఖకు సంబంధించి ఫాం మెకనైజేషన్ స్కీంలో చేర్చితే రైతులకు 40 శాతం సబ్సిడీ ఈ యంత్రాలను అందించవచ్చని దానివల్ల రైతులు అతి తక్కువ ధరకు ఈ యంత్రాలను కొనుగోలు చేయవచ్చని మంత్రి తెలిపారు.

ప్రస్తుతం ఈ యంత్రాలు డీజిల్‌తో నడుస్తుండగా త్వరలోనే బ్యాటరీతో నడిచే యంత్రాలను మార్కెట్‌లోకి తీసుకురావాలని ఈ కంపెనీ యజమానులైన కృష్ణ కొల్లూరి, సిద్ధార్థ పోలిశెట్టి, కౌండిన్య అచ్యుతుని మంత్రి తుమ్మల సూచించారు. బ్యాటరీతో పనిచేసే యంత్రాలు కూడా సుమారుగా 6 నుంచి 7 గంటలు పనిచేసేలా ఉండాలని మంత్రి తుమ్మల సూచించగా, త్వరలోనే వాటిని మార్కెట్‌లోకి తీసుకొస్తామని కృష్ణ కొల్లూరి, సిద్ధార్థ పోలిశెట్టి, కౌండిన్య అచ్యుతునిలు మంత్రి తుమ్మలతో పేర్కొన్నారు. బ్యాటరీతో నడిచే యంత్రాలను త్వరగా మార్కెట్‌లోకి తీసుకొస్తే రైతులకు ప్రయోజనకరంగా ఉంటుందని మంత్రి తుమ్మల వారికి సూచించారు.

ఆపరేటర్లకు శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించేందుకు ‘ఎక్స్-కా అకాడమీ’ ఏర్పాటు

సిబిఐటి పూర్వ విద్యార్థులైన -కృష్ణ కొల్లూరి, సిద్ధార్థ పొలిశెట్టి, కౌండిన్య అచ్చుతునిలు అమెరికాలో మాస్టర్స్ పూర్తి చేశారు. వారు సంయుక్తంగా ఎక్స్-కా మినీ మెషినరీ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థను స్థాపించారు. దీని ప్రధాన కార్యాలయం హైదరాబాద్ లోని గండిమైసమ్మ (డి. పోచంపల్లి) వద్ద ఉంది. XE15 (1.5 టన్ మినీ హైడ్రాలిక్ ఎక్స్కవేటర్) ప్రారంభ ధర రూ. 12,00,000లు కాగా,- XS100 (కాంపాక్ట్ స్కిడ్ స్టీర్ లోడర్) ప్రారంభ ధర రూ. 14,00,000లుగా ఉంది. ఈ యంత్రాలతో రాక్ బ్రేకర్స్, ఆగర్స్, కాంక్రీట్ మిక్సర్స్, ఫోర్క్లిఫ్ట్ వంటి వివిధ రకాల పనులు చేసుకోవచ్చు. దీంతోపాటు వ్యవసాయం, రియల్ ఎస్టేట్, మున్సిపాలిటీలు, గేటెడ్ కమ్యూనిటీలు, చిన్న తరహా నిర్మాణ రంగాల్లో ఇవి చాలా ఉపయోగపడతాయని నిర్వాహకులు తెలిపారు.

2027 నాటికి హైడ్రాలిక్ ఎక్సవేటర్ ఈవీ మార్కెట్‌లోకి…..

భవిష్యత్ ప్రణాళికలో భాగంగా 1.5 టన్ మినీ హైడ్రాలిక్ ఎక్సవేటర్ ఈవీని 2027 నాటికి మార్కెట్‌లోకి తీసుకురావాలని తాము కృషి చేస్తున్నామని కృష్ణ కొల్లూరి, సిద్ధార్థ పొలిశెట్టి, కౌండిన్య అచ్చుతునిలు తెలిపారు. అలాగే, కస్టమర్ల కోసం ప్రత్యేక ‘డెమో జోన్’ను, ఆపరేటర్లకు శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించేందుకు ‘ఎక్స్-కా అకాడమీ’ని కూడా ప్రారంభించనున్నట్లు సంస్థ ప్రతినిధి సిద్ధార్థ పోలిశెట్టి వెల్లడించారు.

Related posts

మమత పార్టీకి మరో ఎదురుదెబ్బ: ఇక ఖాళీ

Satyam News

సీఎం చంద్రబాబు వాహన శ్రేణి కుదింపు

Satyam News

జాతీయ ప్రేరణ ఉత్సవ్ పోటీలకు పట్నం రెడ్డి సాయి ఎంపిక

Satyam News

మోడీ ప్రవర్తన తీరు దేశానికి అవమానకరం

Satyam News

మోడీ ట్రంప్ మధ్యలో ఎలాన్ మస్క్

Satyam News

మాల్యవంతం వారి ఇంట అలరించిన బొమ్మలకొలువు

Satyam News

Leave a Comment