26.3 C
Hyderabad
September 19, 2026
ప్రపంచంహోమ్

కొత్త స్టోరీ: ఇరాన్ అమెరికా చర్చలు మళ్లీ మొదలు?

#IranFlag

ఇరాన్ తో అమెరికా చర్చలు మళ్లీ మొదలు కాబోతున్నాయి. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్  ప్రత్యేక దౌత్య ప్రతినిధి స్టీవ్ వెట్ కాఫ్, ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అర్ఖ్వాచీ మధ్య కీలక చర్చలు స్విట్జర్లాండ్‌లో జరగనున్నట్లు సమాచారం. ఫిబ్రవరి 28న ప్రారంభమైన యుద్ధానికి ముగింపు పలకడం, ఈ వారం కుదిరిన 14 అంశాల తాత్కాలిక ఒప్పందాన్ని శాశ్వత ప్రాంతీయ ఒప్పందంగా మార్చడం ఈ సమావేశాల ప్రధాన లక్ష్యంగా భావిస్తున్నారు.

అయితే లెబనాన్‌లో కాల్పుల విరమణ అమల్లోకి వచ్చిన కొద్ది గంటల్లోనే ఇజ్రాయెల్ దక్షిణ లెబనాన్‌లో వైమానిక దాడులు, డ్రోన్ దాడులు జరపడంతో కనీసం ఐదుగురు మృతి చెందారు. ఇజ్రాయెల్-హెజ్‌బొల్లా మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు శాంతి ప్రక్రియకు సవాలుగా మారే అవకాశముంది.

లెబనాన్‌లో శాంతి కొనసాగడం అమెరికా-ఇరాన్ మధ్య 60 రోజుల చర్చలకు కీలక షరతుగా పేర్కొనబడింది. ఈ చర్చల్లో ఇరాన్ అణు కార్యక్రమం, ఆర్థిక ఆంక్షలు, ప్రాంతీయ భద్రత, చమురు రవాణా మార్గాల భద్రత వంటి అంశాలు ప్రధానంగా చర్చకు రానున్నాయి. ముఖ్యంగా హోర్మోజ్ జలసంధి మళ్లీ పూర్తిస్థాయిలో తెరుచుకోవడం ప్రపంచ చమురు సరఫరాలకు కీలకంగా మారింది.

ఇరాన్‌కు ఆర్థిక ఆంక్షల సడలింపులు, నిలిపివేసిన బిలియన్ల డాలర్ల ఆస్తుల విడుదల, చమురు ఎగుమతులకు అమెరికా మినహాయింపులు వంటి అంశాలు తాత్కాలిక ఒప్పందంలో ఉన్నట్లు సమాచారం. అలాగే ఇరాన్ పునర్నిర్మాణం కోసం 300 బిలియన్ డాలర్ల నిధి ప్రతిపాదన కూడా చర్చల్లో భాగమైంది.

ఇదిలా ఉండగా అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ స్విట్జర్లాండ్ పర్యటనను రద్దు చేసుకున్నారు. మరోవైపు అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో, లెబనాన్ అధ్యక్షుడు జోసఫ్ అయోన్ మధ్య కూడా ఇజ్రాయెల్-లెబనాన్ చర్చలపై సంప్రదింపులు కొనసాగుతున్నాయి.

ఒప్పందంపై అమెరికాలో విమర్శలు వ్యక్తమవుతున్నప్పటికీ అధ్యక్షుడు ట్రంప్ దాన్ని సమర్థించారు. “యుద్ధం ఇరాన్‌ను బలహీనపరిచింది. చర్చలకు అమెరికా అవసరంతో రాలేదు, ఇరాన్ వచ్చింది” అని ఆయన సామాజిక మాధ్యమంలో వ్యాఖ్యానించారు. అయితే ఇరాన్‌కు ఎలాంటి నగదు సహాయం అందదని కూడా స్పష్టం చేశారు.

Related posts

సొంతగడ్డపై సన్రైజర్స్ హైదరాబాద్ నిరాశ

Satyam News

భీమడోలు పంచాయతీలో భారీ అవినీతి

Satyam News

ఇక నుంచి విశాఖపట్నం ఏఐ డేటా హబ్

Satyam News

బీసీ యువతకు ఉద్యోగాల కల్పనే లక్ష్యం

Satyam News

జై అమరావతి అంటూ విజయనగరంలో భారీ ర్యాలీ

Satyam News

ఫార్వర్డ్ ప్లేయర్ నవనీత్ కౌర్ ప్రతిష్టాత్మక అవార్డు

Satyam News

Leave a Comment