ప్రత్యేకంహోమ్

ఇన్వెస్టర్లకు రెడ్ కార్పెట్..లోకేష్ 3S ఫార్ములా అదిరింది!

#NaraLokesh

పెట్టుబడుల సాధనే ఎజెండాగా మంత్రి నారా లోకేష్ సరికొత్త వ్యూహాలతో దూసుకుపోతున్నారు. కోల్‌కతా పర్యటనలో భాగంగా పారిశ్రామిక వర్గాల ముందు మంత్రి లోకేష్ ఉంచిన ప్రతిపాదనలు, సరికొత్త  3S ఫార్ములా – Speed, Stability, Service ఇప్పుడు దేశవ్యాప్తంగా కార్పొరేట్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఏపీ పెట్టుబడులకు దేశంలోనే అత్యంత అనుకూలమైన గమ్యస్థానంగా మారిందో వివరించడానికి లోకేష్ ఈ సరికొత్త ఫార్ములాను తెరపైకి తెచ్చారు. మీరు మాతో చేతులు కలిపిన మరుక్షణమే.. అది కేవలం మీ ప్రైవేట్ ప్రాజెక్ట్ మాత్రమే కాదు, మా ప్రభుత్వ ప్రాజెక్ట్‌గా మారుతుందంటూ లోకేష్ కార్పొరేట్ వర్గాలకు పటిష్టమైన నమ్మకాన్ని ఇచ్చారు.

పారిశ్రామికవేత్తలు దశాబ్దాల తరబడి ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ అనుమతుల కోసం తిరిగే పాత రోజులకు ఏపీలో పూర్తిగా స్వస్తి పలికామని లోకేష్ స్పష్టం చేశారు. స్పీడ్ గవర్నెన్స్ ద్వారా నిర్ణీత కాలంలోనే పనులు పూర్తి చేసి చూపిస్తామని హామీ ఇచ్చారు. ఇదే తరుణంలో జాతీయ స్థాయిలో రాజకీయ స్థిరత్వాన్ని అందిస్తూ, దేశాన్ని సంస్కరణల వైపు నడిపిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వాన్ని ఆయన ప్రత్యేకంగా కొనియాడారు. డబుల్ ఇంజన్ సర్కార్ వేగంతో ఆంధ్రప్రదేశ్ పారిశ్రామికంగా సరికొత్త చరిత్ర సృష్టించబోతోందని చాటిచెప్పారు.

ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సదస్సుతో పాటు కోల్‌కతా కేంద్రంగా ఉన్న పలువురు ప్రముఖ జాతీయ స్థాయి పారిశ్రామికవేత్తలతో మంత్రి లోకేష్ ప్రత్యేకంగా వన్-టు-వన్ సమావేశాలు నిర్వహించారు. గ్రీన్ ఎనర్జీ, మాన్యుఫాక్చరింగ్, లాజిస్టిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగాలకు చెందిన టాప్ CEOలతో విడివిడిగా భేటీ అయ్యారు. రాబోయే ఐదేళ్లలో ఏపీలో 78.5 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని సాధించేందుకు ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ గురించి వారికి పవర్‌పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్‌లో భారీ గ్రీన్ ఎనర్జీ హబ్‌ను ప్లాన్ చేస్తున్న పారిశ్రామిక దిగ్గజాలు..ఏపీలో ఉన్న సుదీర్ఘ సముద్ర తీరం, పోర్టు ఆధారిత మౌలిక వసతుల వైపు దృష్టి సారించేలా లోకేష్ తన గట్టి ప్రతిపాదనలను ముందుంచారు.

మంత్రి లోకేష్ ప్రతిపాదించిన ఈ 2.4 ట్రిలియన్ డాలర్ల విజన్, 3S ఫార్ములా కోల్‌కతా ఇండస్ట్రియల్ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తించింది. కేవలం విధానాల ప్రకటనలకే పరిమితం కాకుండా, అమరావతి రాజధాని నిర్మాణం, విశాఖపట్నంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూనివర్సిటీ స్థాపన, ఐటీ కారిడార్ల విస్తరణ ప్రాజెక్టులను లోకేష్ ఈ పర్యటనలో సమర్థవంతంగా ప్రొజెక్ట్ చేశారు. ల్యాండ్ అక్విజిషన్ వేగవంతం చేస్తామని, పారిశ్రామికవేత్తలకు రెడ్‌ కార్పెట్ పరుస్తామని మంత్రి ఇచ్చిన భరోసాతో బెంగాల్‌కు చెందిన పలు మల్టీనేషనల్ కంపెనీలు త్వరలోనే క్షేత్రస్థాయి పరిశీలన కోసం ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.

Related posts

విద్యాసంస్థల్లో డ్రగ్స్‌పై జీరో టాలరెన్స్ విధానం

Satyam News

తిరుమల శ్రీ‌వారి ఆల‌యంలో ద‌ర్శ‌నం ప్రారంభం

Satyam News

భగవంతుడితో పెట్టుకుంటే సర్వనాశనం తప్పదు

Satyam News

గణేష్ ఉత్సవాల సందర్భంగా ఏం చేయాలి?

Satyam News

జగన్ అనుచరుడి ఉద్యోగం ఊడింది

Satyam News

జర్నలిజాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిది

Satyam News

Leave a Comment