విశాఖపట్నంహోమ్

ఎన్‌ఏడీ కొత్త రోడ్డు ఫ్లైఓవర్‌పై కంటైనర్ బోల్తా

#NewBridge

విశాఖపట్నంలోని ఎన్‌ఏడీ కొత్త రోడ్డు ఫ్లైఓవర్‌పై గురువారం తెల్లవారుజామున భారీ కంటైనర్ బోల్తా పడింది. ఈ ఘటన ఎయిర్‌పోర్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.

స్థానికుల సమాచారం ప్రకారం అర్ధరాత్రి ఒంటి గంట నుంచి రెండు గంటల మధ్య ఈ ప్రమాదం జరిగింది. గాజువాక నుంచి నగరం వైపు వెళ్తున్న భారీ కంటైనర్ ఎన్‌ఏడీ కొత్త రోడ్డు ఫ్లైఓవర్ రోటరీ వద్ద మలుపు తిరుగుతున్న సమయంలో అదుపు తప్పి బోల్తా పడింది.

అయితే ప్రమాదం జరిగిన సమయంలో జనసంచారం లేకపోవడంతో ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదు. దీంతో పెను ప్రమాదం తృటిలో తప్పినట్లైంది.

సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా వాహనాల రాకపోకలను క్రమబద్ధీకరిస్తూ, క్రేన్ల సహాయంతో బోల్తా పడిన కంటైనర్‌ను తొలగించే చర్యలు చేపట్టారు.

ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Related posts

మత్తు మందు ఇచ్చి బాయ్ ఫ్రెండ్ అత్యాచారం

Satyam News

రెండు టవర్లకే స్టాలిన్‌పై ప్రశంసలు…. మరి ఏపీ చూస్తే.!!

Satyam News

వెలుగుమట్ల బాధితుల కోసం కొనసాగుతున్న దీక్ష

Satyam News

నేటి నుంచి టాలీవుడ్‌లో షూటింగ్స్ బంద్

Satyam News

17 నుంచి బాగేశ్వర్ సర్కార్ శ్రీ ధీరేంద్ర కృష్ణ శాస్త్రి దివ్య దర్బార్

Satyam News

మొక్కజొన్న పంటను ప్రకటించిన ధరకే ప్రభుత్వం కొనుగోలు చేయాలి

Satyam News

Leave a Comment