26.3 C
Hyderabad
September 19, 2026
సినిమాహోమ్

ఏపీలో సినీ పరిశ్రమ అభివృద్ధికి కృషిచేస్తా

#NandamuriBalakrishna

ప్రజా రాజధాని అమరావతిలో తొలిసారిగా భారీ సినిమా ప్రారంభోత్సవం జరిగింది. వెలగపూడిలోని బిట్స్ పిలానీ గ్రౌండ్ లో జరిగిన నటసింహం నందమూరి బాలకృష్ణ 112 సినిమా ప్రారంభోత్సవ వేడుకకు విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా నిర్వహించిన పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం క్లాప్ కొట్టి షూటింగ్ ను ప్రారంభించారు. బాలకృష్ణ కుమార్తె తేజస్విని కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ.. సినిమా ప్రారంభోత్సవానికి ఎప్పుడూ వెళ్లలేదు.

అద్భుత అవకాశం ఇచ్చిన ముద్దుల మావయ్య జై బాలయ్యకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. బాలయ్య బాబు నాయకత్వంలో సినీ పరిశ్రమను ప్రజా రాజధాని అమరావతిలో పెద్దఎత్తున ప్రోత్సహించే లక్ష్యంతో పనిచేస్తున్నాం. సినిమాతో పాటు క్రియేటర్ ఎకానమీని కూడా పెద్దఎత్తున ప్రోత్సహించాలనేది సీఎం చంద్రబాబు గారి ఆలోచన.

ఇందుకు కావాల్సిన మౌలిక సదుపాయాలను ఏర్పాటుచేయాలనే లక్ష్యంతో ప్రజాప్రభుత్వం పనిచేస్తోంది. అమరావతిలో సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించడం మా అదృష్టంగా భావిస్తున్నాం. ఇది పవిత్ర భూమి. భవిష్యత్ లో మరిన్ని సినిమాలు ఇక్కడి నుంచే ప్రారంభించాలని కోరుకుంటున్నానని తెలిపారు.

ఈ కార్యక్రమంలో సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్, సినీ దర్శకులు కొరటాల శివ, సినీ నిర్మాత చెరుకూరి సుధాకర్, ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేష్, ఎమ్మెల్యేలు తెనాలి శ్రావణ్ కుమార్, ఎంఎస్ రాజుతో పాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు.

Related posts

అనంతగిరిలో ‘సంఘటన్ సృజన్ అభియాన్’

Satyam News

పిల్లలకు సమ్మర్ స్పోర్ట్ & గేమ్స్ కోచింగ్ క్యాంప్

Satyam News

విశాఖ గో మాంసం అక్రమ నిల్వల వెనుక ఎవరున్నా వదలొద్దు

Satyam News

ఐదు రోజుల పాటు భారీ వర్ష సూచన

Satyam News

జనసేన ఎమ్మెల్యేలు జాగ్రత్త: పవన్

Satyam News

పోలవరం ఎడమ కాలువ ద్వారా రేపు గోదావరి జలాల విడుదల

Satyam News

Leave a Comment