23.9 C
Hyderabad
September 27, 2026
ఆధ్యాత్మికంహోమ్

జూలై నెలలో శ్రీపద్మావతీ అమ్మవారి ఆలయంలో విశేష ఉత్సవాలు

#PadmavatiTemple

తిరుచానూరు శ్రీపద్మావతీ అమ్మవారి ఆలయం మ‌రియు అనుబంధ ఆల‌యాల‌లో జూలై నెలలో పలు విశేష ఉత్సవాలు జరుగనున్నాయి. వాటి వివరాలు ఇలా ఉన్నాయి.

శ్రీపద్మావతీ అమ్మవారి ఆలయంలో….

జూలై 03, 10, 17, 24, 31వ‌ తేదీలలో శుక్రవారం సందర్భంగా సాయంత్రం 6 గంటలకు తిరుచ్చిపై అమ్మ‌వారు ఆల‌య నాలుగు మాడ వీధులలో విహ‌రించి భక్తులకు ద‌ర్శ‌న‌మివ్వ‌నున్నారు.

శ్రీ బలరామ కృష్ణ స్వామి వారి ఆలయంలో ..

జూలై 12న రోహిణి న‌క్ష‌త్రం సంద‌ర్బంగా శ్రీ కృష్ణ స్వామివారికి సాయంత్రం 6 గంట‌లకు తిరుచ్చి ఉత్సవం జ‌రుగ‌నుంది.

శ్రీ సుందరరాజ స్వామి ఆలయంలో..

జూలై 5 నుండి 7వ తేదీ వ‌ర‌కు శ్రీ సుందరరాజస్వామివారి అవతారోత్సవాలు.

జూలై 29న ఉత్తర భద్ర నక్షత్రం సందర్భంగా సాయంత్రం 6 గంట‌లకు స్వామివారు తిరుచ్చిపై ఆల‌య నాలుగు మాడ వీధులలో విహరించి అనుగ్ర‌హించ‌నున్నారు.

శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయంలో…

జూలై 17న దక్షిణాయన పుణ్యకాలం ప్రారంభం సంద‌ర్భంగా సాయంత్రం 5 గంటలకు స్వామివారు తిరుచ్చిపై భక్తులకు దర్శనమివ్వనున్నారు.

జూలై 20న హస్త నక్షత్రం సందర్భంగా సాయంత్రం 5 గంటలకు స్వామివారు తిరుచ్చిపై భక్తులను క‌టాక్షించ‌నున్నారు.

తిరుచానూరు శ్రీనివాస ఆలయం…

ఆగస్టు 4, 11, 18, 25వ‌ తేదీలలో వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి మూలవర్లకు అభిషేకం.

అప్ప‌లాయ‌గుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో….

జూలై 7న ఉద‌యం 8 గంట‌ల‌కు అష్టదళ పాదపద్మారాధన సేవ.

జూలై 8న ఉదయం 8 గంటలకు అష్టోత్తరశత కలశాభిషేకం.

జూలై 17, 24, 31వ తేదీలలో శుక్రవారం సందర్భంగా ఉదయం 7 గంటలకు వస్త్రలంకారణ సేవ, అభిషేకం.

జూలై 30వ తేదీ పుష్ప‌యాగం.

జూలై 5, 12, 19, 26వ‌ తేదీలలో శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి వారికి ఉదయం 8.15 గంట‌లకు అభిషేకం.

Related posts

నవ మల్లెతీగ మంత్లీ మ్యాగజైన్ ఆవిష్కరణ

Satyam News

సోనియా, రాహుల్ పై ఈడీ కేసు కొట్టివేత

Satyam News

హర్యానా మాజీ సీఎంపై సీబీఐ చార్జిషీట్ దాఖలు

Satyam News

తల్లికి వందనం: ఈ నెల 22న తల్లుల ఖాతాల్లోకి రూ.10 వేల కోట్లు!

Satyam News

రబీ రైతు భరోసా కోసం రాహుల్ గాంధీ కి వినతి

Satyam News

ఆర్టీసీ కార్మికుల సమస్యలపై పోరాట భేరి

Satyam News

Leave a Comment