23.9 C
Hyderabad
September 27, 2026
చిత్తూరుహోమ్

తప్పిపోయిన బాలికను 2 గంటల్లో గుర్తించిన తిరుపతి పోలీసులు

#TirupatiPolice

తప్పిపోయిన 9 ఏళ్ల బాలికను తిరుమల పోలీసులు రెండు గంటల్లోపు సురక్షితంగా గుర్తించి రికార్డు సృష్టించారు. కమాండ్ కంట్రోల్ సెంటర్, ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్, బీట్ పోలీసులు, టీటీడీ విజిలెన్స్ సమన్వయంతో ముమ్మరంగా గాలింపు చేపట్టడంతో ఆ బాలికను గుర్తించగలిగారు. వివరాలలోకి వెళితే

మహబూబ్‌నగర్ జిల్లా, జడ్చర్ల మండలం, కిష్టారం గ్రామానికి చెందిన నరసింహులు, లడ్డమ్మ దంపతులు తమ కుమార్తె అను షామిని (9) సంవత్సరాలుతో కలిసి శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చారు. వారు వెంకటాద్రి నిలయం (PAC-5)లో బస చేస్తున్న సమయంలో, 03-07-2026 తెల్లవారుజామున సుమారు 2.00 గంటల నుంచి 2.30 గంటల మధ్య బాలిక కనిపించకుండా పోయింది.

సమాచారం అందుకున్న వెంటనే తిరుమల పోలీసులు అప్రమత్తమై, తిరుమల డీఎస్పీ పర్యవేక్షణలో కమాండ్ కంట్రోల్ సెంటర్, ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్, బీట్ పోలీసులు, టీటీడీ విజిలెన్స్ సిబ్బంది సమన్వయంతో విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. పోలీసు సిబ్బంది అప్రమత్తత, సమన్వయం, వేగవంతమైన స్పందన ఫలితంగా బాలికను సమాచారం అందిన రెండు గంటల్లోపే సురక్షితంగా గుర్తించి కుటుంబ సభ్యులకు అప్పగించారు.

తమ కుమార్తెను క్షేమంగా తిరిగి అప్పగించినందుకు బాలిక తల్లిదండ్రులు తిరుమల పోలీసుల సేవలను హృదయపూర్వకంగా అభినందిస్తూ కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా గాలింపు చర్యల్లో సమర్థవంతంగా పనిచేసిన పోలీసు, ట్రాఫిక్, కమాండ్ కంట్రోల్ సెంటర్, టీటీడీ విజిలెన్స్ తదితర శాఖల సిబ్బందిని జిల్లా ఎస్పీ ఎల్.సుబ్బరాయుడు, అభినందించారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు భక్తులకు పలు సూచనలు చేశారు:

తిరుమలకు చిన్నపిల్లలు, వృద్ధులు, మానసిక పరిస్థితి సరిగా లేని వ్యక్తులతో వచ్చినప్పుడు వారి పేరు, చిరునామా, కుటుంబ సభ్యుల మొబైల్ నంబర్లు ఉన్న గుర్తింపు చీటీ లేదా ఐడీ కార్డును తప్పనిసరిగా ఉంచాలి.

రద్దీ ప్రాంతాల్లో చిన్నపిల్లలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఒంటరిగా వదిలివేయరాదు.

కుటుంబ సభ్యులు ఒకరిపై ఒకరు నిరంతరం దృష్టి ఉంచాలి.

ఎవరైనా తప్పిపోయినట్లయితే ఆలస్యం చేయకుండా సమీప పోలీసు సిబ్బందికి సమాచారం ఇవ్వాలి లేదా అత్యవసర సేవల కోసం డయల్ 112కు వెంటనే ఫోన్ చేయాలి.

భక్తుల భద్రతకు తిరుమల పోలీసులు, టీటీడీ విజిలెన్స్ సిబ్బంది ఎల్లప్పుడూ అప్రమత్తంగా సేవలందిస్తున్నారని, భక్తులు కూడా తగిన జాగ్రత్తలు పాటించడం ద్వారా ఇటువంటి ఘటనలను నివారించవచ్చని జిల్లా ఎస్పీ తెలిపారు.

Related posts

కపిల్ దేవ్ ను గుర్తుకు తెచ్చిన హర్మన్‌ప్రీత్

Satyam News

త్వరలో వస్తున్న సోనియాగాంధీ ఆత్మకథ

Satyam News

అజిత్ పవార్ తో ముగిసిన ఆ ఇద్దరి కథ….

Satyam News

తిరుపతి సంస్కృత యూనివర్సిటీలో లైంగికదాడి?

Satyam News

కల్పవృక్ష వాహనంపై శ్రీ వేదనారాయణ స్వామి

Satyam News

‘లూయిస్ వ్యూట్టన్’లో రాజ్ దాసిరెడ్డి సందడి

Satyam News

Leave a Comment