23.9 C
Hyderabad
September 27, 2026
హైదరాబాద్హోమ్

మంత్రి కొండా సురేఖను కలిసిన శైలజా రామయ్యర్

#KondaSurekha

పర్యావరణ, అటవీశాఖల ప్రిన్సిపల్ సెక్రటరీగా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన శైలజా రామయ్యర్  అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ ని జూబ్లిహిల్స్ లోని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ శైలజా రామయ్యర్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

శైలజా రామయ్యర్ నేతృత్వంలో అటవీ,పర్యావరణ శాఖలు మరింత ప్రభావవంతంగా పనిచేసి, ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను సాధించాలని ఆకాంక్షించారు. సీఎం రేవంత్ రెడ్డి గారి ఆశయాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం పర్యావరణ పరిరక్షణ, వన మహోత్సవం, వన్యప్రాణులు, జీవవైవిధ్య పరిరక్షణ, అడవుల్లో అగ్నిప్రమాదాల నివారణ, అడవుల సంరక్షణలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞాన వినియోగం తదితర కార్యక్రమాలను సమర్థవంతంగా చేపట్టేలా కార్యాచరణను అమలు చేయాలని మంత్రి సురేఖ శైలజా రామయ్యర్ కు దిశానిర్దేశం చేశారు.

అటవీ, పర్యావరణ శాఖల బలోపేతం దిశగా ప్రణాళికాబద్దంగా కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. ఈ సందర్భంగా అటవీ, పర్యావరణ శాఖలకు సంబంధించిన పలు అంశాల పై మంత్రి కొండా సురేఖ,  ముఖ్య కార్యదర్శి శైలజా రామయర్య మధ్య సంక్షిప్తంగా చర్చ జరిగింది.

Related posts

ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడొద్దు

Satyam News

ఢిల్లీలో మల్లికార్జున ఖర్గే తో వనపర్తి చిన్నారెడ్డి

Satyam News

యువ యూట్యూబర్ కోమలి ఆత్మహత్య

Satyam News

బీ ఆర్ ఎస్ పై ప్రజల విశ్వాసానికి గుర్తు ఇది

Satyam News

అర్హులైన జర్నలిస్టులకు అక్రెడిటేషన్ కార్డుల జారీ

Satyam News

నిర్మలమ్మ బడ్జెట్ లో తెలంగాణకు గుండు సున్నా

Satyam News

Leave a Comment