26.3 C
Hyderabad
September 19, 2026
క్రీడలుహోమ్

5వ పోలీస్ క్రీడల్లో తెలంగాణ పోలీస్ అకాడమీ విజయదుందుభి

జూలై 7 నుంచి 9 వరకు హైదరాబాద్‌లోని సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన 5వ తెలంగాణ రాష్ట్ర పోలీస్ స్పోర్ట్స్ మీట్ – క్లస్టర్ (A) పోటీలలో తెలంగాణ పోలీస్ అకాడమీ (TGPA) క్రీడాకారులు విశేష ప్రతిభ కనబరిచి మొత్తం 26 పతకాలు సాధించి అకాడమీకి మరోసారి గర్వకారణంగా నిలిచారు.

అకాడమీ డైరెక్టర్ అభిలాష బిస్త్ ఐపీఎస్ నాయకత్వంలో, అసిస్టెంట్ డైరెక్టర్ (MT & Accommodation) టి.ఎ. భరత్ పర్యవేక్షణలో పోటీలకు సిద్ధమైన అకాడమీ జట్టు వివిధ క్రీడాంశాల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచింది. వెయిట్ లిఫ్టింగ్, యోగా, పెంచక్ సిలాట్, , తైక్వాండో, ఆర్మ్ రెజ్లింగ్, బాడీ బిల్డింగ్, రెజ్లింగ్ వంటి విభాగాల్లో క్రీడాకారులు ప్రతిభ చాటుతూ మొత్తం 3 స్వర్ణ, 9 రజత, 14 కాంస్య పతకాలను కైవసం చేసుకున్నారు.

మహిళా, పురుష క్రీడాకారులు సమాన ఉత్సాహంతో పోటీల్లో పాల్గొని వ్యక్తిగత, జట్టు విభాగాల్లో విజయాలు సాధించడం విశేషం. ఈ విజయాలు అకాడమీలో అందిస్తున్న నాణ్యమైన శిక్షణ, క్రమశిక్షణ, శారీరక దృఢత్వానికి నిదర్శనంగా నిలిచాయి.

పోటీల్లో పతకాలు సాధించిన క్రీడాకారులను అకాడమీ డైరెక్టర్ అభినందిస్తూ, రాష్ట్ర పోలీసు శాఖకు మరిన్ని విజయాలు అందించాలని ఆకాంక్షించారు. క్రీడాస్ఫూర్తి, శారీరక సామర్థ్యం, మానసిక దృఢత్వం ప్రతి పోలీసు ఉద్యోగికి అత్యంత అవసరమని పేర్కొన్నారు.

తెలంగాణ పోలీస్ అకాడమీ నుండి పాల్గొన్న 26 మందిలో పోలీస్ కానిస్టేబుల్ వై శ్రీను 7 , పి సి పరశురామ్ 4 ,ఏ ఆర్ ఎస్ ఐ ఆంజనేయులు 3, హెడ్ కానిస్టేబుల్ ప్రసాద్ 2, ఏ ఆర్ ఎస్ ఐ వవజరెడ్డి 2, పి సి లు మాధురి,పద్మావతి, లు 2 చొప్పున, డి ఎస్ పి జగదీశ్వర్ , హెడ్ కానిస్టేబుల్ చంద్రశేఖర్, ఏ ఆర్ ఎస్ ఐ సురేష్ లు ఒక్కోటి చొప్పున 26 వివిధ క్రీడల్లో సాధించారు.

వారు సాధించిన పతకాల వివరాలు:

స్వర్ణ పతకాలు – 3

రజత పతకాలు – 9

కాంస్య పతకాలు – 14

మొత్తం పతకాలు – 26

రాష్ట్రస్థాయి పోలీస్ క్రీడల్లో తెలంగాణ పోలీస్ అకాడమీ క్రీడాకారులు సాధించిన ఈ విజయాలు అకాడమీ క్రీడా సంస్కృతికి, శిక్షణా నాణ్యతకు, సిబ్బంది అంకితభావానికి మరో మైలురాయిగా నిలిచాయి. అకాడమీ టీం మేనేజర్ గా డి ఎస్ పి తిరుపతి వ్యవహరించారు.

Related posts

వ్యూహాత్మకంగా లోకల్ ఎలక్షన్స్.. వైసీపీకి కోలుకోలేని దెబ్బ?

Satyam News

చరిత్ర సృష్టిస్తున్న మిడ్ ఫీల్డర్ రుతుజ

Satyam News

సొంత ప్రభుత్వంపై ‘రాములమ్మ’ నిప్పులు!

Satyam News

తెనాలి కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ నూతన భవనం ప్రారంభం

Satyam News

జీఎస్టీ తగ్గించినా వసూళ్లు ఎందుకు పెరిగాయి?

Satyam News

మమత పార్టీకి మరో ఎదురుదెబ్బ: ఇక ఖాళీ

Satyam News

Leave a Comment