చిత్తూరుహోమ్

తిరుమల కొండపై ఒక విలేఖరి ఆక్రమణలు

తిరుమల కొండపై టీటీడీ నిబంధనలకు విరుద్ధంగా రెండు ప్రాంతాల్లో దుకాణాల్లాంటి తట్టలను ఆక్రమించుకొని రోజుకు పదివేల రూపాయలకు పైగా అక్రమంగా బాడుగలు వసూలు చేసుకుంటూ, బాలాజీ నగర్ లో నివాసం కోసం కేటాయించిన ఇంటిని హోటల్ గా మార్చేసి రోజుకు 30 వేల రూపాయల దాకా అక్రమ సంపాదనకు పాల్పడుతూ… పవిత్రమైన తిరుమలలో దందాలకు దౌర్జన్యాలకు పాల్పడుతున్న ఒక విలేఖరి వ్యవహారం ఇప్పుడు కలకలం రేపుతోంది.

ఎటువంటి ఆధారాలు లైసెన్సులు లేకపోయినా ఈ విలేఖరి వైసీపీ నేత భూమన అండదండలతో పాపవినాశం తీర్థంలో ఒక తట్ట ఏర్పాటు చేసుకొని వ్యాపారం చేసుకుంటున్నారు.

అసలు అర్హతే లేని ఈ తట్టతో పాటు కొండపై డిఎంబి రోడ్డు ప్రాంతంలో ఉన్న నడిరోడ్డులో రేకుల షెడ్డు కి ఆనుకొని మరో తట్టను ఏర్పాటు చేసుకున్నారు. యాత్రికులు ఈ దారిలో కనీసం నడిచేందుకు కూడా దారి లేకుండా మొత్తం ఆక్రమించేశారు. ఈ విలేఖరి అక్రమాలకు రెండున్నర ఏళ్ల క్రితం టిటిడి చైర్మన్ లు గా పని చేసిన భూమన కరుణాకర్ రెడ్డి, వై వి సుబ్బారెడ్డి లు అందించిన సహకారంతో సాక్షి విలేఖరి తనకు అడ్డే లేదన్నట్లుగా విచ్చలవిడిగా రెచ్చిపోయారు.

ఇది చాలదన్నట్లు స్థానికులు నివసిస్తున్న బాలాజీ నగర్ నివాసాల ప్రాంతంలో వినాయకుడి ఆలయం ఎదురుగా 87 నెంబర్ ఇంటిని, పక్కనే మరోక ఇంటిని ఒక పెద్ద హోటల్ గా మార్చేశారు. ఇక్కడ స్థానికుల నివాసానికి మాత్రమే వినియోగించాలని ఎటువంటి వ్యాపారాలు నిర్వహించకూడదని టీటీడీ గట్టి నిబంధనలు విధించింది.

ఎన్నోసార్లు ఆరోగ్యశాఖ అధికారులు, రెవెన్యూ, పంచాయితీ అధికారులు బాలాజీ నగర్ నివాస ప్రాంతంలో తనిఖీలు నిర్వహించారు. అక్రమంగా నిర్వహిస్తున్న అనేక హోటళ్లను తినుబండారాలు తయారు చేస్తున్న ఇళ్లను సీజ్ చేశారు. అయినా కూడా  విలేఖరి బంధువుల పేర్లతో నడుస్తున్న బాలాజీ నగర్ లోని రెండు ఇళ్ళను మాత్రం హోటల్లుగా నిర్వహిస్తున్నప్పటికీ ఎటువంటి అనుమతులు లేకపోయినా అధికారులు చూసి చూడకుండా వదిలేశారు. దీని వెనుక మతలబు ఏమిటో అధికారులకే తెలియాలి.

డి ఎం బి రోడ్డులో శ్రీవారి భక్తులు సేదదీరేందుకు టిటిడి రెండు కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఏర్పాటు చేసిన పెద్ద రేకుల షెడ్డు యాత్రికులకు ఉపయోగపడకపోగా… హాకర్లు, అసాంఘిక శక్తులకు, అక్రమాలకు ఆక్రమణలకు అడ్డాగా మారి పోయింది. దీన్ని తొలగించాలని తిరుమల స్థానికులు అంతా ప్రభుత్వానికి ఇటు టిటిడి కి విజ్ఞప్తి చేసుకున్నా కూడా కేవలం ఈ  విలేఖరి తట్టకు ఇబ్బంది అవుతుందని… అక్కడి నుండి తొలగించాల్సి వస్తుందనే కారణంగా అసలు రేకుల షెడ్డు నే తొలగించకుండా టిటిడి ఇంజనీరింగ్ అధికారులు ఏళ్ల తరబడి అలాగే ఉంచేశారని వ్యాపారులంతా గగ్గోలు పెడుతున్నారు.

Related posts

వైభవంగా లక్ష్మీనరసింహ కళ్యాణం

Satyam News

శ్రీవారి బ్రహ్మోత్సవాలకు క్షేత్రస్థాయిలో ప్రణాళికలు

Satyam News

తుఫాను ప్రభావంతో స్తంభించిన గన్నవరం ఎయిర్ పోర్టు

Satyam News

అర్హతలేని వారికి రవాణా కాంట్రాక్టులు

Satyam News

ఫేక్ ప్రచారం చేసిన భూమన మనుషుల అరెస్టు

Satyam News

సర్పంచ్ ఎన్నికల్లో దొంగ నోట్ల పంపిణీ?

Satyam News

Leave a Comment