మంత్రి నారా లోకేష్ ఇప్పుడు తనదైన స్టైల్‌లో పాలన సాగిస్తున్నారు. అనవసర హంగామా, బహిరంగ సభలు, కోట్లాది రూపాయలు పెట్టి ఫుల్ పేజీ ప్రకటనల డబ్బా అసలే లేదు. కేవలం పని, ఫలితం మీద మాత్రమే దృష్టి పెడుతున్నారు.
తాజాగా నారా లోకేష్ తీసుకున్న నిర్ణయమే ఇందుకు నిదర్శనం. వైసీపీ ప్రభుత్వం ఏళ్లుగా పెండింగ్‌లో పెట్టిన విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల కోసం రూ. 1200 కోట్ల రూపాయలు రిలీజ్ చేశారు. కానీ ఎక్కడా అందుకు ప్రచారం చేయలేదు. జగన్ ప్రభుత్వ హయాంలో అమలు చేసిన బటన్ నొక్కుడు విధానం వల్ల ఎడ్యుకేషన్ సిస్టమ్ తీవ్రంగా దెబ్బతింది.
ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులను వైసీపీ ప్రభుత్వం పక్కదారి పట్టించింది. దీంతో కూటమి ప్రభుత్వం ఏర్పడే నాటికి రూ. 4 వేల కోట్లు బకాయిలు పేరుకుపోయాయి. దీంతో చదువు పూర్తయినా సర్టిఫికెట్లు చేతిక రాక లక్షలాది మంది విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. జగన్ ప్రభుత్వ తప్పులను సరిదిద్దుతూ విద్యా వ్యవస్థను పట్టాలెక్కిస్తున్నారు నారా లోకేష్.
ఇప్పుడు రూ.1200 కోట్లు రిలీజ్ చేసి అటు విద్యార్థులకు, ఇటు కాలేజీ యాజమాన్యాలకు బిగ్ రిలీఫ్ ఇచ్చారనే చెప్పాలి. ప్రచారం కాదు పారదర్శకతనే నమ్ముకున్నారు నారా లోకేష్. అందుకే, నిధులు నేరుగా కాలేజీల ఖాతాల్లోకే జమ అయ్యేలా పక్కాగా ప్లాన్ చేశారు. గతంలో మాదిరిగా నిధుల మళ్లింపునకు ఎక్కడా అవకాశం లేకుండా, విద్యార్థుల విద్యా చదువులు సజావుగా సాగేలా చర్యలు తీసుకున్నారు.
ఒక్కో సమస్యను సైలెంట్‌గా పరిష్కరిస్తూ, విద్యా రంగాన్ని గాడిలో పెడుతున్న తీరు ప్రశంసలు కురిపిస్తోంది. లోకేష్ కేవలం ఫీజు రీయింబర్స్‌మెంట్ విషయంలోనే కాదు, నిరుద్యోగులకు ఇచ్చిన మెగా DSC హామీ విషయంలోనూ తన మాటను సైలెంట్‌గా నిలబెట్టుకున్నారు.
ఎన్నికల హామీల్లో ఇచ్చిన మాట ప్రకారం, అధికారంలోకి రాగానే ఎక్కడా కాలయాపన చేయకుండా 16 వేల 347 పోస్టులతో మెగా DSC నోటిఫికేషన్‌ను విడుదల చేయడంతో పాటు భర్తీ ప్రక్రియను అత్యంత వేగంగా పూర్తి చేశారు.
జగన్ ప్రభుత్వం ఐదేళ్ల కాలంలో ఒక్క DSC కూడా నిర్వహించకుండా నిరుద్యోగులను వంచించిన తీరుకు భిన్నంగా, లోకేష్ బాధ్యతలు చేపట్టిన వెంటనే అటు ఉద్యోగాల భర్తీని, ఇటు విద్యా వ్యవస్థ ప్రక్షాళనను సమాంతరంగా పరుగులు పెట్టిస్తున్నారు.
మీరు ధైర్యంగా చదువుకోండి..మీ వెంట ప్రభుత్వం ఉంటుంది అంటూ లోకేష్ ఇచ్చిన భరోసా విద్యార్థుల్లో నమ్మకాన్ని పెంచింది. రాజకీయాల్లో విమర్శలు, హడావిడి కంటే క్షేత్రస్థాయిలో సమస్యల పరిష్కారమే ముఖ్యమని లోకేష్ నిరూపిస్తున్నారు.
లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తూనే, హై ఇంపాక్ట్ ఇచ్చే నిర్ణయాలతో విద్యార్థుల భవిష్యత్తుకు బలమైన పునాది వేస్తున్నారు.
