27.3 C
Hyderabad
September 17, 2026
విశాఖపట్నంహోమ్

భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ రెడీ… ఉత్తరాంధ్ర కలలకు రెక్కలు

#BhogapuramInternationalAirport

భోగాపురం ఎయిర్‌పోర్టు నిర్మాణం పూర్తయింది. ట్రయల్‌ రన్‌కు సర్వం సిద్ధం చేశారు. జనవరి 4న ఇక్కడి రన్‌వేపై తొలి కమర్షియల్‌ ఫ్లయిట్‌ ల్యాండ్‌ అవుతుంది. ఢిల్లీ నుంచి రానున్న ఎయిర్‌ ఇండియా విమానం ఫస్ట్‌ ఫ్లయిట్‌ అయితే.. కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడు ఫస్ట్‌ పర్సన్‌గా వస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. ఎయిర్‌పోర్టు పనులు వేగం పుంజుకొన్నాయి. విమానయాన శాఖ మంత్రిగా టీడీపీ ఎంపీ రామ్మోహన్‌ నాయుడు ఉండటంతో.. అనుమతులు, నిధుల కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేకుండా పోయింది. దగ్గరుండి అన్ని పర్మిషన్స్‌ తీసుకొచ్చి.. అవసరమైన నిధులు కేటాయించి.. ఎయిర్‌పోర్టు నిర్మాణాన్ని పూర్తి చేశారు.

2026 జూన్‌ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్టులో పూర్తిస్థాయి కమర్షియల్‌ ఆపరేషన్స్‌ ప్రారంభం అవుతాయి. జనవరి 4న జరగనున్న ట్రయల్‌ రన్‌ తర్వాత వరుసగా మరిన్ని ట్రయల్స్‌ నిర్వహిస్తారు. ఆ తర్వాత వివిధ ఎయిర్‌లైన్స్ సంస్థలతో మాట్లాడి.. భోగాపురం విమానాశ్రయం నుంచి మన దేశంలోని డెస్టినేషన్స్‌తో పాటు.. ఇంటర్నేషనల్‌ సర్వీసులు ప్రారంభించడానికి ఒప్పించాల్సి ఉంటుంది. ఈ ఎయిర్‌పోర్టులో విమానాల మెయింటెన్స్‌, ఓవర్‌హాలింగ్‌ కేంద్రాలను కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇండిగో ఎయిర్‌లైన్స్‌కి భోగాపురం ఎయిర్‌పోర్టు హబ్‌గా మారనుంది.

కొత్త ఎయిర్‌పోర్టు కావడంతో.. ఇక్కడి నుంచి ప్రారంభమయ్యే ఫ్లయిట్‌ టికెట్ రేట్లు తక్కువగా ఉంటాయి. ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాలతో పాటు ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల ప్రయాణికులకు భోగాపురం ఎయిర్‌పోర్టు ఉపయోగకరంగా ఉంటుంది. విశాఖలో ఐటీ, ఫార్మాతో పాటు పర్యాటక రంగం వేగంగా అభివృద్ధి చెందుతోంది. నగరంలో రెండో ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టు అందుబాటులోకి రావడం ద్వారా వైజాగ్‌ సిటీతో పాటు ఉత్తరాంధ్రకు పెట్టుబడులు మరింత పెరిగే అవకాశం ఉంది. కూటమి అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే ఎయిర్‌పోర్టు ప్రారంభం అయ్యేలా పనులు చేయించిన కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడి పనితనాన్ని ఉత్తరాంధ్ర వాసులు మెచ్చుకొంటున్నారు. పని చేసే ప్రభుత్వాన్ని ఎన్నుకుంటే ఫలితం ఎలా ఉంటుందో చెప్పడానికి భోగాపురం ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టు ప్రత్యక్ష ఉదాహరణగా నిలుస్తోంది.

Related posts

బీహార్‌లో శ్రీవారి ఆలయ నిర్మాణానికి 15 ఎకరాల భూమి కేటాయింపు

Satyam News

నటి దేవీప్రియ కారుకు ప్రమాదం..డ్రైవర్ మృతి…

Satyam News

నేపాల్ వరదల్లో చిక్కుకున్న ఏపీ వాసుల పరిస్థితిపై సీఎం సమీక్ష

Satyam News

వైసీపీ సింపతీ ఫార్ములాకు ఎక్స్‌పైరీ డేట్.. జనాల్లో రివర్స్ ఎఫెక్ట్‌!

Satyam News

రూ 4.82 కోట్ల విలువైన చైనా బాణసంచా పట్టివేత

Satyam News

ఉద్యోగుల కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పిస్తున్న ప్రభుత్వం

Satyam News

Leave a Comment