26.3 C
Hyderabad
September 19, 2026
మెదక్హోమ్

పెళ్లైన నెలకే దంపతుల ఆత్మహత్య

సిద్దిపేట జిల్లా కొండపాక గ్రామంలో అత్యంత విషాదకర ఘటన చోటుచేసుకుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న నవ దంపతులు, వివాహమైన నెల రోజులకే మనస్పర్ధల కారణంగా తనువు చాలించడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే.. అంజలి, వినయ్ అనే యువతీ యువకులు గత ఏడాది కాలంగా ప్రేమించుకున్నారు.

వీరి ప్రేమను అంగీకరించిన పెద్దలు, గత నెల మే 9వ తేదీన ఘనంగా వివాహం జరిపించారు. అయితే, ఆ సంతోషం ఎంతో కాలం నిలవలేదు. అంజలి వేరొకరితో ఫోన్‌లో మాట్లాడుతోందనే అనుమానం వినయ్‌లో మొదలైంది. ఈ విషయంలో ఇద్దరి మధ్య తరచూ వాగ్వాదాలు జరగడంతో, వినయ్ కోపంతో అంజలిని ఆమె పుట్టింట్లో వదిలిపెట్టి వెళ్ళిపోయాడు.

అక్కడితో ఆగకుండా, ఫోన్ ద్వారా కూడా వినయ్ ఆమెపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో అంజలి తీవ్ర మనస్థాపానికి గురైంది. ఈ క్రమంలో మనస్తాపం తట్టుకోలేక అంజలి తన ఇంట్లోని ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. భార్య మరణవార్త విన్న వినయ్, తీవ్ర ఆవేదనకు లోనయ్యాడు. తన ప్రవర్తన వల్లే ఈ ఘోరం జరిగిందన్న బాధతో అతను కూడా సమీపంలోని ఒక చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

నెల రోజుల క్రితం పెళ్లి వేడుకతో కళకళలాడిన ఆ ఇళ్లలో, ఇప్పుడు మరణ మృదంగం వినిపించడంతో గ్రామం మొత్తం విషాదంలో మునిగిపోయింది. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Related posts

కాల్పుల విరమణ ఒప్పందాన్ని స్వాగతించిన భారత్

Satyam News

టీమిండియాకు బీసీసీఐ భారీ నజరానా

Satyam News

నెదర్లాండ్స్ ను ఓడించి సూపర్ 8 కు భారత్

Satyam News

తొలి ప్రవాస భారతీయుని బయోగ్రఫీ “జిందగీ ఇన్ టు షేడ్స్”

Satyam News

త్రిమూర్తుల కలయిక వల్లే రాష్ట్రం అభివృద్ధి

Satyam News

ట్రంప్ డ్రామాలతో యూరప్ కు జెంప్

Satyam News

Leave a Comment