విశాఖపట్నంహోమ్

ఉత్తరాంధ్ర రూపురేఖలు మార్చనున్న భోగాపురం

#Pardhasaradhi

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభంతో ఉత్తరాంధ్ర భవిష్యత్తు, ముఖచిత్రం పూర్తిగా మారిపోనుందని రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి  అన్నారు. అల్లూరి సీతారామరాజు భోగాపురం విమానాశ్రయం వద్ద శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఉత్తరాంధ్ర అభివృద్ధికి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఒక గేమ్‌ ఛేంజర్‌గా నిలుస్తుందని తెలిపారు.

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ఉత్తరాంధ్ర సమగ్ర అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ప్రజల సంక్షేమం,ఆర్థికాభివృద్ధి, ఉపాధి,రవాణా,పర్యాటకం, సాంస్కృతిక అభివృద్ధికి దోహదపడే అనేక ప్రతిష్టాత్మక ప్రాజెక్టులను ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు తెలిపారు.

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి మూడు లక్షలకు పైగా ప్రజలు హాజరుకానున్న నేపథ్యంలో వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. ప్రజల రాకపోకలకు ఇప్పటికే సుమారు 5–6 వేల బస్సులను ఏర్పాటు చేశామని, ప్రజా ప్రతినిధులు కూడా తమ సొంత వాహనాలతో పాటు మినీ బస్సులను ఏర్పాటు చేస్తున్నారని వివరించారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోడి చేతులమీదుగా రూ. 17,900 కోట్ల ప్రాజెక్టులకు ప్రారంభం కానున్నాయన్నారు.ప్రధాన మంత్రి భోగాపురం పర్యటనకు వస్తున్న నేపథ్యంలో కార్యక్రమ ఏర్పాట్లను ముఖ్యమంత్రి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారని మంత్రి తెలిపారు.ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్‌ కార్యక్రమ ఏర్పాట్లపై ప్రతిరోజూ రెండుసార్లు సమీక్షిస్తూ, అధికారులు మరియు ప్రజాప్రతినిధులకు అవసరమైన సూచనలు చేస్తున్నారని చెప్పారు.

భోగాపురం ఎయిర్‌పోర్టు ప్రారంభోత్సవం,ఉత్తరాంధ్ర అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించేందుకు సమాచార,పౌర సంబంధాల శాఖ ఆధ్వర్యంలో భారీ ప్రచార కార్యక్రమాలు చేపట్టినట్లు మంత్రి తెలిపారు.

శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం నగరాల్లో సుమారు 200 హోర్డింగ్స్,50 ఎల్‌ఈడీ స్క్రీన్స్ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ప్రత్యేకంగా డ్రోన్ల ద్వారా కూడా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, ఇందుకోసం 5 డ్రోన్లను ఏర్పాటు చేశామని తెలిపారు. అదేవిధంగా  డిజిటల్,సోషల్ మీడియా వేదికల ద్వారా భోగాపురం ఎయిర్‌పోర్టు ప్రాధాన్యత, ఉత్తరాంధ్రకు రానున్న అభివృద్ధి అవకాశాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారని మంత్రి పార్థసారథి వివరించారు.

విమానాశ్రయంతో ఎగుమతులకు కొత్త ఊపు లభిస్తుందని మంత్రి పేర్కొన్నారు. భోగాపురం ఎయిర్‌ పోర్టులో 25,000 మెట్రిక్ టన్నుల కార్గో సామర్థ్యం కలిగిన టెర్మినల్ అందుబాటు లోకి రావడంతో ఉత్తరాంధ్ర నుంచి దేశ,విదేశాలకు ఎగుమతులు మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. ఈ విమానాశ్రయం ద్వారా ఈ ప్రాంతంలో ఆర్థిక,సామాజిక, వాణిజ్య రంగాల్లో గణనీయమైన మార్పులు వస్తాయని పేర్కొన్నారు.

ఇప్పటివరకు ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు,దేశాలకు వలస వెళ్లే ప్రాంతంగా ఉన్న ఉత్తరాంధ్ర,భవిష్యత్తులో ఇతర ప్రాంతాల వారికి కూడా ఉపాధి కల్పించే స్థాయికి ఎదుగు తుందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.విమానాశ్రయం ద్వారా ప్రపంచంలోని అనేక ప్రాంతాలకు మెరుగైన కనెక్టివిటీ ఏర్పడి,యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మరింత విస్తరిస్తాయని తెలిపారు.

పోలవరం నీటితో ఉత్తరాంధ్రకు మరింత ప్రయోజనం కలుగుతుందని ఆగస్టు 14 న పోలవరం ప్రాజెక్టు ఎడమ ప్రధాన కాలువ నుంచి ఉత్తరాంధ్రకు నీటిని తీసుకువచ్చే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు మంత్రి తెలిపారు. సాగు నీరు, తాగు నీరు, పరిశ్రమలు,వ్యవసాయ రంగాలకు ఈ కార్యక్రమం ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలతో ఉత్తరాంధ్ర భవిష్యత్తు బంగారుమయంగా మారుతుందని మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవం ఆంధ్రప్రదేశ్ చరిత్రలో చిరస్మరణీయ ఘట్టంగా నిలిచేలా ఘనంగా నిర్వహిస్తున్నామని మంత్రి తెలిపారు.

Related posts

ఏపీకి పండగొచ్చింది…. చంద్రబాబు సర్కార్‌ ఉగాది వరాలు

Satyam News

అంతర్జాతీయ డేటా గేట్ వే గా వైజాగ్

Satyam News

సింహాచలం గిరిప్రదక్షిణకు ఏర్పాట్లు పూర్తి

Satyam News

అమిత్‌ షాతో బాబు భేటీ…. వైసీపీలో మొదలైన టెన్షన్.!

Satyam News

అమరావతి మీదుగా 3 బుల్లెట్ ట్రైన్ కారిడార్లు

Satyam News

ఉమర్ ఖాలిద్ కు బెయిల్ నిరాకరించిన సుప్రీం కోర్టు

Satyam News

Leave a Comment