విశాఖపట్నంహోమ్

అప్పుల బాధ తాళలేక వ్యాపారి ఆత్మహత్య

అప్పులబాధ తాళలేక స్క్రాప్ షాపు యజమాని రాగల ఆదినారాయణ (45) ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అచ్యుతాపురం సీఐ చంద్రశేఖరరావు, ఎస్సై వెంకట రావు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం కుముదవల్లి గ్రామానికి (భీమవరం )చెందిన రాగాల ఆదినారాయణ రెడ్డి అచ్యుతాపురం మండలం వెదురువాడ అయ్యప్పస్వామి ఆలయం వద్ద ఉంటూ అక్కడే స్క్రాప్ షాపు నడుపుతున్నాడు.

ఒక మోసగాడు ఇతను వద్దకు వచ్చి తాను షీలానగర్ వద్ద నిర్మాణంలో ఉన్న ఈఎస్ఐ ఆసుపత్రి వద్ద గుమస్తాగా పనిచేస్తున్నానని అక్కడ 200 టన్నులు పాత ఇనుము ఉందని తెలిపాడు. దీనిని విక్రయిస్తానని నమ్మించి అక్కడకి తీసుకోని వెళ్లి నమ్మించాడు.

మొత్తం ఇనుమును 15 లక్షలకు అమ్ముతానని అడ్వాన్స్ గా 3.75 లక్షలు చెల్లించాలనన్నాడు. ఈ నెల 5 వ తేదీన ఇనుము తెచ్చేందుకు లారీని తీసుకెళ్లగా , గాజువాకలోని వేబ్రిడ్జ్ వద్ద ఖాళీ లారీని బరువు వేయించిన తరువాత ఈఎస్ఐ ఆసుపత్రి వద్దకు రావాలని చెప్పి, ఒప్పందం చేసుకున్న డబ్బులు తీసుకోని మోసగాడు పరారయ్యాడు.

మోసగాడికి ఎన్ని సార్లు ఫోన్ చేసిన ప్రయోజనం లేకపోగా సమీపంలో విచారణ చేశారు. అటువంటి వారు ఎవరు లేరని తెలియయడంతో గాజువాక పోలీసులును ఆశ్రయించాడు. సీసీ కెమెరా ఫుటేజ్, నగదు చెల్లింపు వివరాలు ఇవ్వాలని పోలీసులు కోరారు.

జీవితంపై విసుగు చెందిన ఆదినారాయణ అదేరోజు ఆత్మహత్య యత్నం చేశాడు. విషయం తెలిసి వెంట వెళ్ళినవారు వారించి ఇంటికి తీసుకెళ్లారు. మోసగించిన వ్యక్తి ఆ సొమ్మును తిరిగి ఇవ్వకపోవడం వల్ల, అప్పు ఇచ్చిన వారి నుంచి ఒత్తిడి రావడంతో మనస్తాపంతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నడు.

గమనించిన బంధువులు సమీపంలో ఉండే ఆసుపత్రికి తరలించిన ప్రయోజనం లేకపోయింది భార్య వరలక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ చంద్రశేఖర్ రావు తెలిపారు. మృతుడికి భార్య,ఇద్దరు కుమారులు ఉన్నారు.

సీనియర్ జర్నలిస్ట్ పూడి రామకృష్ణ విశాఖపట్నం

Related posts

గద్దర్ అవార్డ్ ఇచ్చిన ఉత్తేజంతో త్వరలో రెండో చిత్రం

Satyam News

ఆత్మహత్య నుంచి మహిళను రక్షించిన పోలీసులు

Satyam News

ద్విచక్రవాహనదారులు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలి

Satyam News

జగన్‌-భారతి స్కెచ్‌కు విజయమ్మ బ్రేకులు..ఆస్తి వివాదంలో ట్విస్ట్‌!

Satyam News

రాయచోటి లో పోలీసు కవాతు

Satyam News

అమరావతిలో మరో సంచలనం….

Satyam News

Leave a Comment