కడపహోమ్

మైనర్ బాలిక దారుణ హత్య: ఉద్రిక్తత

అన్నమయ్య జిల్లా మదనపల్లిలో ఒక మైనర్ బాలిక దారుణ హత్యకు గురికావడం స్థానికంగా పెను ఉద్రిక్తతలకు దారితీసింది. బాలికను అత్యంత పాశవికంగా హతమార్చిన నిందితుడు కులవర్ధన్, మృతదేహాన్ని ఒక డ్రమ్ములో దాచి ఉంచడం సంచలనం సృష్టించింది.

ఈ విషయం వెలుగులోకి రావడంతో ఆగ్రహోద్వేగాలకు లోనైన స్థానికులు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి నిరసన చేపట్టారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని, తక్షణమే అతడిని ఎన్‌కౌంటర్ చేయాలని డిమాండ్ చేస్తూ కదిరి – మదనపల్లి జాతీయ రహదారిని గత ఆరు గంటలుగా దిగ్బంధించారు. దీంతో హైవేపై కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు కడప జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్, మదనపల్లి సబ్ కలెక్టర్ కళ్యాణి స్వయంగా రంగంలోకి దిగి ఆందోళనకారులతో చర్చలు జరిపారు. న్యాయం చేస్తామని అధికారులు హామీ ఇచ్చినప్పటికీ, ఆగ్రహంతో ఉన్న స్థానికులు వారి మాటలను వినడానికి నిరాకరించారు.

నిందితుడి ఇంటి వైపు వెళ్లకుండా పోలీసులను అడ్డుకోవడమే కాకుండా, పరిసర ప్రాంతాల్లో తీవ్ర నిరసనలు కొనసాగిస్తున్నారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకునే వరకు వెనక్కి తగ్గేది లేదని స్థానికులు భీష్మించుకోవడంతో మదనపల్లిలో ప్రస్తుతం యుద్ధ వాతావరణం నెలకొంది. శాంతిభద్రతల పరిరక్షణ కోసం భారీగా పోలీసు బలగాలను రంగంలోకి దించారు.

Related posts

శ్రీనగర్ – లడఖ్ మధ్య రవాణా కష్టాలకు చెక్

Satyam News

రూ 4.82 కోట్ల విలువైన చైనా బాణసంచా పట్టివేత

Satyam News

శ్రీ గోదాదేవి శ్రీ మహాలక్ష్మీదేవి సమేత శ్రీ ప్రసన్న రంగనాథ స్వామి కల్యాణం

Satyam News

సింగరేణిలో సహజ మరణానికి కూడా 10 లక్షల ఉచిత బీమా

Satyam News

ఇంటర్ విద్యార్థులకు మంత్రి లోకేష్ శుభాకాంక్షలు

Satyam News

అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ ఎలా ఉంటుందో తెలుసా?

Satyam News

Leave a Comment