హైదరాబాద్హోమ్

నవాబ్ అలీ నవాజ్ జంగ్ బహదూర్ కు నివాళి

#Tribute

తెలంగాణలో అనేక నీటిపారుదల ప్రాజెక్టులకు రూపకల్పన చేసి, చారిత్రక భవనాల నిర్మాణానికి మార్గదర్శకత్వం వహించిన అపర భగీరథుడు నవాబ్ అలీ నవాజ్ జంగ్ బహదూర్ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆ మహనీయునికి ఘనంగా నివాళులర్పించారు.

వారి విశిష్ట సేవలను స్మరించుకుంటూ నిర్వహిస్తున్న తెలంగాణ ఇంజనీర్స్ డే సందర్భంగా రాష్ట్రంలోని ఇంజనీర్లందరికీ ముఖ్యమంత్రి ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు.

“ప్రపంచాన్ని ముందుకు నడిపించే శక్తి ఇంజనీర్ల ఆలోచనల్లో ఉంటుంది. వారి ప్రతిభ, సృజనాత్మకత, కృషి వల్లే అసాధ్యంగా అనిపించిన ఎన్నో కలలు సాకారమవుతున్నాయి. ప్రతి సమస్యను ఒక అవకాశంగా మార్చే దృక్పథం, ప్రతి సవాలుకు వినూత్న పరిష్కారాలను అందించే నైపుణ్యం ఇంజనీర్ల ప్రత్యేకత. ఇంజనీర్ ఆలోచనలో భవిష్యత్తు ఉంటుంది. ప్రతి నిర్మాణంలో సమాజ ప్రగతి ఉంటుంది.” అని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఒక సందేశంలో పేర్కొన్నారు.

Related posts

యూట్యూబర్ పై దుండగుల కాల్పులు

Satyam News

సంగీత సరస్వతి ఎస్. జానకి కన్నుమూత

Satyam News

SIRతో దొంగ ఓట్ల గుట్టు రట్టు..వైసీపీలో మొదలైన వణుకు.!

Satyam News

జగన్ ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు రూ.4064.59 కోట్లు

Satyam News

తిరుపతి, విశాఖ అభివృద్ధికి కేంద్రం భారీ నిధులు

Satyam News

ఇజ్రాయెల్ చేరుకున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్

Satyam News

Leave a Comment