కరీంనగర్హోమ్

సిరిసిల్ల వడ్ల కొనుగోలు కేంద్రం పరిశీలించిన కేటీఆర్

#ktr

సిరిసిల్ల నియోజకవర్గంలో రైతుల సమస్యలను తెలుసుకునేందుకు ఎమ్మెల్యే కేటీఆర్ విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా వడ్ల కొనుగోలు కేంద్రాలను పరిశీలించి, అక్కడి పరిస్థితులపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రైతులు నెల రోజులుగా వడ్లు తీసుకొస్తున్నప్పటికీ ఇప్పటివరకు ఒక్క గింజ కూడా కొనుగోలు చేయలేదని ఆయన ఆరోపించారు. మద్దతు ధరతో పాటు బోనస్ ఇవ్వాల్సి వస్తుందనే ఉద్దేశంతోనే ప్రభుత్వం కొనుగోళ్లు చేపట్టడం లేదని విమర్శించారు.

రైస్ మిల్లులను కేటాయించకపోవడం వల్ల కొనుగోలు ప్రక్రియ పూర్తిగా నిలిచిపోయిందని, దీనివల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. అధికారులను అడిగితే ఇప్పటివరకు 1000 క్వింటాళ్ల వడ్లు కూడా కొనలేదని చెబుతున్నారని ఆయన పేర్కొన్నారు. దళారుల ద్వారా కొనుగోళ్లు జరిపితే కమిషన్లు ఇవ్వాల్సి వస్తుందని భావించి ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా కొనుగోళ్లు నిలిపివేసిందని ఆరోపించారు. అకాల వర్షాల కారణంగా రైతులు తెచ్చిన ధాన్యం తడిసి పాడైపోతుందనే ఆందోళన వ్యక్తం చేశారు. రైతులు తమ ఖర్చుతో టార్పాలిన్ కవర్లు కొనుగోలు చేసి వడ్లను కాపాడుకునే పరిస్థితి ఏర్పడిందని చెప్పారు. రైతు బంధు వంటి పథకాలను కూడా సక్రమంగా అమలు చేయడం లేదని ప్రభుత్వంపై మండిపడ్డారు.

రైతుల ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని, లేని పక్షంలో ఉద్యమానికి దిగుతామని హెచ్చరించారు. రాబోయే కాలంలో పరిస్థితులు మారుతాయని, రెండేళ్లలో మళ్లీ తమ ప్రభుత్వం వస్తుందని, అప్పటి నుంచి రైతులను కంటికి రెప్పలా కాపాడుకుంటామని కేటీఆర్ హామీ ఇచ్చారు.

Related posts

కవాడీగూడాలో మహిళ దారుణ హత్య

Satyam News

దళిత మహిళ పై దాడిచేసిన అగ్రకులస్తుడు

Satyam News

ట్రాన్స్‌జెండర్లకు రాజకీయ సాధికారతకు శ్రీకారం

Satyam News

‘ప్రభుత్వ సారాయి దుకాణం’ చిత్ర టీజర్ లాంచ్

Satyam News

శ్రీ పద్మావతి అమ్మవారి  కార్తీక బ్రహ్మోత్సవాల‌లో సాంస్కృతిక‌ శోభ

Satyam News

ఏపీకి రష్యన్ టెక్నాలజీ…… పెట్టుబడుల వేటలో లోకేశ్ స్మార్ట్ స్కెచ్!

Satyam News

Leave a Comment