ముఖ్యంశాలుహోమ్

షర్మిల పై ఘాటు వ్యాఖ్యలు చేసిన గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు

రాష్ట్ర పీసీసీ అధ్యక్షురాలు వైఎస్. షర్మిల టీడీపీకి ఊడిగం చేస్తున్నారంటూ గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి ఆదివారం ఘాటు వ్యాఖ్యలు చేశారు. డిలిమిటేషన్ మీద ఏమాత్రం అవగాహన లేకుండా షర్మిల మాట్లాడుతున్నారంటూ ఆదివారం ఓ వీడియోను విడుదల చేశారు. ఈరోజు దివంగత మాజీ ముఖ్యమంత్రి వైయస్. రాజశేఖర్ రెడ్డి ఆత్మ క్షోభీంచిందన్నారు.

తెలుగుదేశం పార్టీ తానా అంటే వైఎస్. షర్మిల తందానా అంటున్నారని విమర్శించారు. పాపులేషన్ సెన్సేషన్ ప్రకారం డీలిమిటేషన్ అనేది జరిగితే దక్షిణ భారత రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్ర, తమిళనాడు, కేరళ తీవ్రంగా నష్టపోతాయని అన్నారు. కేంద్రమంత్రి 50% సీట్లు పెంచడం తమకు సమ్మతమేనా అని కాంగ్రెస్ ను అడిగారన్నారు. ఒకసారి సమ్మతమే అన్ని, మరోసారి సమ్మతం లేదని చెబుతున్నారని అసలు వారికి సరైన అవగాహనే లేదన్నారు.

గతంలో కూడా ఇలానే కాంగ్రెస్ పార్టీ ప్రవర్తించినట్లు చెప్పారు. వైయస్. జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీని స్థాపించినప్పుడు కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం అరెస్టు చేయాలనుకున్నప్పుడు, తన తండ్రి కాసు వెంకట కృష్ణారెడ్డి అలా చేయడం తప్పని చెప్పారని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీలో నుంచి వెళ్లిన మమతా బెనర్జీ, శరత్ పవర్ లు పార్టీలు పెట్టుకోలేదా అని అడిగారు.

తెలుగు వారందరూ కలిసి ఉండాలని 70 దశకంలో అప్పటి ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి తన పదవికి రాజీనామా చేస్తే, తెలంగాణ బిడ్డ పీవీ. నరసింహారావు సీఎం అయ్యారని గుర్తు చేశారు. ఆ తరువాత ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణను విడగొట్టి స్పెషలిస్ట్ స్టేటస్ ఇస్తానని చెప్పి ఇవ్వలేదన్నారు. ఇప్పుడు ఎందుకు ఇవ్వటం లేదని కేంద్ర అధికార పార్టీని ప్రశ్నిస్తున్నారని అన్నారు.

వైయస్. షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టి అప్పటి సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ను బూతులు తిట్టారని ఆ తర్వాత, రేవంత్ రెడ్డి కాళ్లు పట్టుకుని పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారని చెప్పుకొచ్చారు. ఆ తరువాత ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడితో చేతులు కలిపారన్నారు. వైయస్. షర్మిల కు ఒక పద్ధతి పాడు లేదని, ఏ ఎండకు ఆ గొడుగు పట్టి తిరుగుతున్నారని విమర్శించారు.

బయట నుంచి తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇవ్వటం ఎందుకు తెలుగుదేశం పార్టీలో చేరితే సరిపోద్ది కదా అని ఎద్దేవా చేశారు. ఇప్పటికి కూడా దక్షిణాది రాష్ట్రాలలో 50 శాతం పార్లమెంటు సీట్లు పెరుగుతాయనేది సమంజసమన్నారు. రాజ్యాంగం బద్ధంగా జనాభా లెక్కలకు అనుగుణంగా డీలిమిటేషన్ జరిగితే తీవ్రంగా నష్టపోతున్నామని చెప్పారు.

ఇది తెలుసుకోకుండా ఏడిపడితే అది మాట్లాడితే ఒప్పుకునేది లేదన్నారు. జగన్మోహన్ రెడ్డిని ప్రత్యర్థులు ఏ భాషలో అయితే విమర్శిస్తారో అదే పదాలతో వారిని విమర్శిస్తామని హెచ్చరించారు.

Related posts

అమరరాజాని ఏపీ నుండి తరిమిన పెద్దిరెడ్డి ఫ్యామిలీ….??

Satyam News

గుడివాడలో వేడెక్కిన రాజకీయం

Satyam News

తుది దశకు చేరుకున్న రష్యా-ఉక్రెయిన్ యుద్ధం

Satyam News

జగన్ చేసిన తప్పులే ప్రజలకు శాపాలు

Satyam News

ఉచిత వైద్య శిబిరం విజయవంతం

Satyam News

టివికే విజయ్ ఇంట్లో పండుగ వాతావరణం

Satyam News

Leave a Comment