జాతీయంహోమ్

ఒరిస్సాలో ఉపరితల ఆవర్తనంతో మారిన వాతావరణం

#rain

ఒరిస్సాలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనంతో ఒక్క సారిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాతావరణం మారింది. ఒడిశా పరిసర ప్రాంతాల్లో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ప్రభావం రాష్ట్రంపై స్పష్టంగా కనిపిస్తోందని విశాఖ వాతావరణ శాఖ అధికారి జగన్నాథ్ కుమార్ తెలిపారు.

గంగానది ప్రాంతం నుంచి పశ్చిమ బెంగాల్ వరకు విస్తరించి, అక్కడి నుంచి మన్నార్ గల్ఫ్ వరకు సాగుతున్న ద్రోణి ప్రస్తుతం ఒడిశా పై ఉన్న ఉపరితల ఆవర్తనం మీదుగా కొనసాగుతోందని చెప్పారు. ఈ వాతావరణ పరిస్థితులతో పాటు సముద్రం నుంచి తేమతో కూడిన గాలులు రాష్ట్రం వైపు వీస్తుండటంతో వర్షాలు కురిసే అవకాశాలు పెరిగినట్లు తెలిపారు.

ఈ ప్రభావంతో ఉత్తర కోస్తా ప్రాంతాల్లో ఈరోజు కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో కూడా ఒకటి రెండు చోట్ల తేలికపాటి ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని తెలిపారు.

రాబోయే 24 గంటల్లో కొన్ని ప్రాంతాల్లో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశముందని హెచ్చరించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గడిచిన 24 గంటల్లో అత్యధిక వర్షపాతం విజయనగరం జిల్లాలోని తెర్లాం లో నమోదైందని తెలిపారు.

అక్కడ 11 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా వాతావరణ మార్పులను దృష్టిలో ఉంచుకుని రైతులు, మత్స్యకారులు జాగ్రత్తలు పాటించాలని వాతావరణ శాఖ సూచించింది.

Related posts

దస్తగిరి హత్య కేసులో వైసీపీ నేతకి బిగిస్తున్న ఉచ్చు…..!!

Satyam News

వైట్ హౌస్ లో ట్రంప్ దీపావళి వేడుకలు

Satyam News

దేశ రాజధాని ఢిల్లీలో భారీ పేలుళ్లు:ఉలిక్కిపడ్డ దేశం!

Satyam News

ప్రతి ఓటరును SIRలో భాగస్వామిని చేయండి

Satyam News

సర్వేల్లో వైసీపీ గ్రాఫ్‌ డౌన్‌…. ఆయనే మెయిన్‌ విలన్‌..??

Satyam News

ఏపీకి కేంద్ర కేబినెట్‌ మరో గుడ్‌ న్యూస్‌

Satyam News

Leave a Comment