ఆధ్యాత్మికం హోమ్

మకర సంక్రాంతి తేదీపై వివాదం: పుణ్యకాలం పోతే పండగ ఎందుకు?

ఈ ఏడాది మకర సంక్రాంతి తేదీపై తెలుగు రాష్ట్రాల్లో మరోసారి తీవ్ర చర్చ మొదలైంది. భారత ప్రభుత్వ రాష్ట్రీయ పంచాంగం ప్రకారం జనవరి 14 బుధవారమే మకర సంక్రాంతి అని స్పష్టంగా ఉండగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు జనవరి 15ను పండుగగా ప్రకటించడంపై ఆధ్యాత్మిక, శాస్త్రీయ వర్గాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి.

ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి), శ్రీశైల దేవస్థాన పంచాంగాల్లోని సంక్రమణ సమయాల మధ్య వ్యత్యాసం కూడా ఈ వివాదానికి కేంద్రబిందువుగా మారింది.రాష్ట్రీయ పంచాంగం అంటే…భారత ప్రభుత్వం 1956 మార్చి 22న ఒక కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా పండుగలు, పర్వదినాల తేదీల్లో వస్తున్న గందరగోళానికి చెక్ పెట్టేందుకు 14 భారతీయ భాషల్లో రాష్ట్రీయ పంచాంగం ముద్రణ ప్రారంభించింది.

అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ దేశమంతటి నుంచి దాదాపు 300 మంది ఖగోళ, గణిత, శాస్త్ర పండితులను ఆహ్వానించి పంచాంగ గణితానికి ఒకే ప్రామాణికాన్ని నిర్ణయించారు. ఈ శాస్త్రీయ విధానానికే దృగ్గణితం అని పేరు పెట్టారని భారత ఆమోద గణిత పంచాంగకర్త ప్రముఖ జ్యోతిష్య సిద్దాంతి పొన్నలూరి శ్రీనివాస గార్గేయ వివరించారు.

దృగ్గణితం అంటే..

దృక్ అంటే కన్ను.. కంటికి ప్రత్యక్షంగా కనిపించే ఖగోళ చలనాలను ఆధారంగా చేసుకుని గణితం చేయడమే దృగ్గణితం. సూర్యుడు, చంద్రుడి స్థానాలను టెలిస్కోప్‌ల ద్వారా ప్రత్యక్షంగా గమనించడంఆ స్థానాలను ఖచ్చితమైన గణిత సూత్రాలతో లెక్కించడం. శాస్త్రీయంగా నిర్ధారితమైన డేటాను మాత్రమే పంచాంగంలో వినియోగించడం.

ఈ విధానంతో తయారైనదే భారత ప్రభుత్వ రాష్ట్రీయ పంచాంగం. ఇందులో ఇచ్చే తిథి, నక్షత్ర, సంక్రమణ సమయాలు అత్యంత ఖచ్చితమైనవిగా గుర్తింపు పొందాయని గార్గేయ తెలిపారు.

పంచాంగ గణితం..శాస్త్రీయ మూలాలు: పంచాంగంలో తిథి ఎలా వస్తుంది..

సూర్య స్థితి నుంచి చంద్ర స్థితిని తీసేస్తే తిథి వస్తుంది. ఈ సూర్య–చంద్ర స్థితులను శాస్త్రీయంగా ఎఫిమరీస్ అంటారు. తెలుగులో వీటినే కోష్టకాలు అని పిలుస్తారు. ఒక సంవత్సరానికి అవసరమైన 365 రోజుల కోష్టకాలను సంప్రదాయ పద్ధతిలో తయారు చేయాలంటే దాదాపు 9 నెలల సమయం పడుతుంది. అందుకే ఆధునిక శాస్త్రం అందించే ఎఫిమరీస్‌ను ఉపయోగించి లాగరిథమ్స్ టేబుల్స్ (జంత్రి) లాగానేఖచ్చితమైన తిథి, నక్షత్ర, వర్జ్య, అమృత కాలాలను లెక్కిస్తున్నారని గార్గేయ పేర్కొన్నారు.

జనవరి14 మకర సంక్రమణ.. శాస్త్రీయ సత్యం

రాష్ట్రీయ పంచాంగం ప్రకారంఈ ఏడాది జనవరి 14 (బుధవారం) మధ్యాహ్నం 3 గంటల 7 నిమిషాలకు సూర్యుడు మకర రాశిలో ప్రవేశించే ఘట్టాన్ని టెలిస్కోప్‌లలో ప్రత్యక్షంగా చూడవచ్చని ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అందుకే భారత ప్రభుత్వం జనవరి 14నే మకర సంక్రాంతి పర్వదినంగా సెలవు ప్రకటించిందని గార్గేయ వివరించారు.

ప్రధాని నరేంద్ర మోడీ ఉజ్జయినిలో ఏర్పాటు చేసిన వరల్డ్ ఫస్ట్ వేదిక్ క్లాక్ టవర్ కూడా జనవరి 14 మధ్యాహ్నం 3.07 గంటలకు మకరరాశిలోకి సూర్య ప్రవేశాన్ని తెలియజేస్తుందని గార్గేయ వెల్లడించారు.తెలుగు రాష్ట్రాల్లో జనవరి 15?ఇక్కడే అసలు వివాదం మొదలవుతోంది. ఆంధ్రప్రదేశ్‌లోప్రభుత్వం జనవరి 15ను సంక్రాంతిగా ప్రకటించింది. టిటిడి పంచాంగంలో కూడా జనవరి 15నే మకర సంక్రాంతిగా పేర్కొన్నారు

దీంతో కేంద్ర ప్రభుత్వ పంచాంగాన్ని నమ్మాలా.. దేవస్థాన పంచాంగాన్ని విశ్వాసించాలా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయనే ప్రశ్నలు ప్రజల్లో ఉత్పన్నమవుతున్నాయి. దేవస్థాన పంచాంగాల మధ్యే తేడా…ఈ ఏడాది జనవరి 14 తేదీకి సంబంధించి టిటిడి పంచాంగం ప్రకారం పుష్య బహుళ ఏకాదశి సాయంత్రం 6.03కు ముగింపు కాగా అనూరాధ నక్షత్ర ముగింపు రాత్రి 3.38 ఉండగా మకర సంక్రమణ రాత్రి 9.11కు పేర్కొన్నారు.

ఇదిలావుండగా శ్రీశైల దేవస్థాన పంచాంగం ప్రకారం పుష్య బహుళ ఏకాదశి సాయంత్రం 6.03 గంటలకు ముగింపు, అనూరాధ నక్షత్ర ముగింపు రాత్రి 3.37 కు కాగా మకర సంక్రమణ సమయం రాత్రి 8.43 గంటలకు ఇవ్వడం జరిగింది. ఈ రెండు దేవస్థాన పంచాంగాలాలో తిథి, నక్షత్ర సమయాలు ఒకేలా ఉన్నాసంక్రమణ సమయం మాత్రం 28 నిమిషాల తేడా ఎందుకని గార్గేయ ప్రశ్నించారు.

పంచాంగకర్తలు ఇంద్రగంటి ప్రసాద శర్మ, గొర్తి పట్టాభిశాస్త్రి మాటల్లోదేవస్థాన పంచాంగాలు సగం పూర్వగణితం మరియు సగం దృగ్గణితం ఆధారంగా తయారవుతున్నాయనీ, కేంద్ర ప్రభుత్వ రాష్ట్రీయ పంచాంగం మాత్రం పూర్తిగా శాస్త్రీయ దృగ్గణితంపై ఆధారపడిందన్నారు. గణితంలో ఏ రెండు విలువలు తెలిసినా మూడో విలువ ఖచ్చితంగా లభిస్తుంది.

అలాంటప్పుడు తిథి, నక్షత్రాలు ఒకేలా ఉండి… సంక్రమణ సమయం ఎలా మారుతుందని ప్రముఖ పంచాంగకర్త డా. చిత్రాల గురుమూర్తి గుప్త ప్రశ్నించారు.పుణ్యకాలం పోయాక పండుగేనా…జనవరి 14 బుధవారమే మకర సంక్రమణ పుణ్యకాలం ఉందని పండితులు స్పష్టం చేస్తున్నారు. పుణ్యకాలం ముగిసిన తర్వాత (జనవరి 15న) తర్పణాలు చేస్తే పితృదేవతలు స్వీకరించరని శాస్త్ర విరుద్ధమని పలువురు పురోహితులు వ్యాఖ్యానిస్తున్నారు.

కేంద్ర ప్రభుత్వం జనవరి 14 ప్రకటిస్తే రాష్ట్ర ప్రభుత్వం జనవరి 15 ఎందుకు?

ఇది ప్రభుత్వ మిత్రత్వమా.. లేక శాస్త్ర విరోధమా.. అనే ప్రశ్నలు ప్రజల్లో వెల్లువెత్తుతున్నాయి.ఆధ్యాత్మిక, శాస్త్రీయ వర్గాల డిమాండ్.. ఈ ఏడాది మకర సంక్రాంతిని జనవరి 14గానే అధికారికంగా ప్రకటించాలని, టిటిడి పంచాంగాన్ని పునఃసమీక్షించి రాష్ట్రీయ పంచాంగాన్ని టిటిడిలో ప్రవేశపెడితేనే పండగల్లో తేడాలు ఉండవని, ప్రజల్లో గందరగోళం ఉండదని పలువురు వేదపండితుల అభిప్రాయం.

కాగా దేశంలోని 27 రాష్ట్రాల్లోజనవరి 14నే సంక్రాంతి జరుపుకుంటుండగా… తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే ఇలా తేదీలపై వివాదాలు రావడం శోచనీయమని మేధావులు వ్యాఖ్యానిస్తున్నారు.శాస్త్రమా.. సంప్రదాయమా..ఈ రెండింటి మధ్య సమతుల్యం సాధించాల్సిన బాధ్యత ఇప్పుడు ప్రభుత్వాలపైనే ఉందని ఆధ్యాత్మిక వర్గాలు స్పష్టం చేస్తున్నారు.

Related posts

టీడీపీలో చేరిన వైసీపీ ఎమ్మెల్సీలు

Satyam News

మారుతున్న భారతావనికి నిదర్శనం ఆపరేషన్ సిందూర్

Satyam News

విజయసాయి రెడ్డి టార్గెట్ భారతీ రెడ్డా?

Satyam News

Leave a Comment

error: Content is protected !!